By: ABP Desam | Updated at : 27 Apr 2022 03:03 PM (IST)
Edited By: Ramakrishna Paladi
రాహుల్ త్రిపాఠి (SRH Twitter)
IPL 2022 gt vs srh rashid khan struggles against rahul tripathi : ఐపీఎల్ 2022లో బుధవారం గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (GT vs SRH) తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు తలపడ్డ మొదటి మ్యాచులో కేన్ సేనే గెలిచింది. మరోసారీ అదే ఫీట్ రిపీట్ చేయాలని హైదరాబాద్ అనుకుంటోంది. మ్యాచ్ అప్స్ సైతం అలాగే ఉన్నాయి.
* అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) బౌలింగ్ అంటే చాలామందికి హడల్! అంతర్జాతీయంగా మహామహులైన బ్యాటర్లు అతడిని ఎదుర్కొనేందుకు ఇష్టపడరు. అలాంటిది రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi) మాత్రం అతడికి చుక్కలు చూపిస్తున్నాడు. అస్సలు భయపడటం లేదు. త్రిపాఠిపై రషీద్ రికార్డు అంత బాగాలేదు. 26 బంతుల్లో 35 పరుగులు ఇచ్చాడు. 135 స్ట్రైక్‌రేట్‌తో రన్స్ ఇచ్చాడు. ఒకే ఒక్కసారి డిస్మిస్ చేశాడు. అంటే నేటి మ్యాచులో రషీద్ ఖాన్‌ను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ త్రిపాఠిని రంగంలోకి దించుతుంది అనడంలో సందేహం లేదు.
* యార్కర్ కింగ్ నటరాజన్ (T Natarajan)తో గుజరాత్ టైటాన్స్‌కు ప్రమాదం తప్పదు. ఈ ఐపీఎల్‌లోనే బెస్ట్ బౌలర్‌గా అతడు కొనసాగుతున్నాడు. అటు పవర్‌ప్లే ఇటు డెత్ ఓవర్లలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. వికెట్లు తీస్తున్నాడు. పవర్‌ప్లేలో 6 వికెట్లు తీశాడు. మరెవ్వరికీ ఈ రికార్డు లేదు. డెత్‌లో అతడి 6 వికెట్లతో పోలిస్తే డ్వేన్ బ్రావో (9), భువి (7) మాత్రమే ముందున్నారు.
* గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman gill) స్వింగ్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ (Bhuvaneshwar) బౌలింగ్‌లో ఆడలేకపోతున్నాడు. అతడు వేసిన 37 బంతుల్లో 86.48 స్ట్రైక్‌రేట్‌తో 32 పరుగులే చేశాడు. రెండుసార్లు ఔటయ్యాడు.
* కేన్ మామకూ ఓ గండం పొంచివుంది. షమి బౌలింగ్‌లో ఔటవుతున్నాడు. 10 టీ20 ఇన్నింగ్సుల్లో 47 బంతుల్లో 66 పరుగులే చేశాడు. నాలుగు సార్లు ఔటయ్యాడు.
We may be on a good run of form, but Umran Malik has set his sights on lasting the full distance at #IPL2022 💪#GTvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/XgLDUcd4uZ
— SunRisers Hyderabad (@SunRisers) April 27, 2022
GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్ 'కిల్లర్' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్
GT vs RR, Qualifier 1: జోస్ ది బాస్ - నాకౌట్లో బట్లర్ 89 - GT ముందు భారీ టార్గెట్ !
Maya Sonawane: మాయా! ఇదేం మాయ బౌలింగ్! వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో వైరలైన బౌలింగ్ యాక్షన్
WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్ థండర్స్ ముందు సాగని హర్మన్ మెరుపుల్!
GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్ - రాజస్థాన్ తొలి బ్యాటింగ్
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్