News
News
X

GT Vs LSG: ప్రాణ స్నేహితుల మధ్య తొలి పోరు - కొత్త జట్లలో గెలుపెవరిదో?

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

FOLLOW US: 

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇది ఈ సీజన్‌లో నాలుగో మ్యాచ్. ఐపీఎల్ కెరీర్‌లో రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రాణ స్నేహితులన్న సంగతి తెలిసిందే.

పిచ్ ఎలా ఉంది?
మొదటి మ్యాచ్‌లో చెన్నై, కోల్‌కతా తలపడ్డ పిచ్‌నే ఈ మ్యాచ్‌కు కూడా ఉపయోగిస్తున్నారు. 132 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు నష్టపోయి కోల్‌కతా ఛేదించింది. మ్యాచ్ ప్రారంభంలో పేసర్లకు పిచ్ సహకరించనుంది. వాతావరణంలో తేమ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు అడ్వాంటేజ్ కానుంది. గత 10 మ్యాచ్‌ల్లో ఆరు సార్లు ఛేదన చేసిన జట్టే విజయం సాధించింది.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్న హార్దిక్‌కు ఈ మైదానంలో మంచి రికార్డు ఉంది. 28 ఇన్నింగ్స్‌లో 471 పరుగులను అతను సాధించాడు. 24 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. లక్నో ఆటగాళ్లలో కేఎల్ రాహుల్‌కు ఈ మైదానంలో అద్భుతమైన రికార్డు ఉంది. కేవలం ఏడు ఇన్నింగ్స్‌లోనే 399 పరుగులను రాహుల్ సాధించాడు. వీటిలో ఒక శతకం, రెండు అర్థ శతకాలు ఉన్నాయి.

ఈ మైదానంలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 170.4గా ఉంది. ఈ మైదానం మొత్తం 57 వికెట్లు పడ్డాయి. వీటిలో 37 వికెట్లను పేసర్లు దక్కించుకోగా... స్పిన్నర్లకు 13 వికెట్లు దక్కాయి. 2008లో రాజస్తాన్ రాయల్స్... డెక్కన్ చార్జర్స్‌పై 105 పరుగుల తేడాతో ఈ మైదానంలోనే విజయం సాధించింది.

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్ చూడవచ్చు. దీంతోపాటు స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ 3 హెచ్‌డీల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక హాట్ స్టార్ యాప్‌లో హిందీ, ఇంగ్లిష్, బంగ్లా, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, మరాఠీ భాషల్లో కామెంటరీ కూడా అందుబాటులో ఉండనుంది.

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, గురుకీరత్ సింగ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాహుల్ టెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, ఆర్.సాయి కిషోర్, లోకి ఫెర్గూసన్

లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు (అంచనా)
కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎవిన్ లెవిస్, క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, ఆండ్రూ టై, అవేష్ ఖాన్

Also Read: PBKS Vs RCB: కెప్టెన్ మారినా కలిసిరాలేదు - పంజాబ్‌పై ఆరు వికెట్లతో బెంగళూరు ఓటమి!

Also Read: Tilak Varma in IPL: అసలెవరీ తిలక్ వర్మ - ముంబై తరఫున అరంగేట్రం - మొదటి మ్యాచ్‌లోనే మెరుపులు!

Published at : 28 Mar 2022 05:30 PM (IST) Tags: IPL 2022 Lucknow Super Giants Gujarat Titans GT Vs LSG Preview GT Vs LSG Gujarat Titans Vs Lucknow Super Giants

సంబంధిత కథనాలు

BCCI over IPL Team Owners: ఐపీఎల్‌ ఓనర్లకు భయపడుతున్న బీసీసీఐ! ఎందుకంటే?

BCCI over IPL Team Owners: ఐపీఎల్‌ ఓనర్లకు భయపడుతున్న బీసీసీఐ! ఎందుకంటే?

Google Pixel 6A Sale: గూగుల్ పిక్సెల్ 6ఏ సేల్ ప్రారంభం - ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్!

Google Pixel 6A Sale: గూగుల్ పిక్సెల్ 6ఏ సేల్ ప్రారంభం - ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్!

Shahid Afridi On Indian Cricket: ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోంది- భారత్‌ ఏం చెబిదే అదే జరుగుతుంది: అఫ్రిదీ

Shahid Afridi On Indian Cricket: ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోంది- భారత్‌ ఏం చెబిదే అదే జరుగుతుంది: అఫ్రిదీ

IPL Media Rights: ఐపీఎల్‌ మీడియా హక్కులపై జే షా కీలక కామెంట్స్‌!

IPL Media Rights: ఐపీఎల్‌ మీడియా హక్కులపై జే షా కీలక కామెంట్స్‌!

IPL Media Rights: మళ్లీ స్టార్ చేతికే ఐపీఎల్ టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న వయాకాం - BCCIకి రూ.50 వేల కోట్లు!

IPL Media Rights: మళ్లీ స్టార్ చేతికే ఐపీఎల్ టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న వయాకాం - BCCIకి రూ.50 వేల కోట్లు!

టాప్ స్టోరీస్

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్