By: ABP Desam | Updated at : 20 Apr 2022 10:30 PM (IST)
Edited By: Ramakrishna Paladi
దిల్లీ క్యాపిటల్స్,
DC vs PBKS, Match Highlights: ఐపీఎల్ 2022లో దిల్లీ క్యాపిటల్స్ అతిపెద్ద విక్టరీ సాధించింది. కేవలం 10.3 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించింది. పంజాబ్ నిర్దేశించిన 116 పరుగుల టార్గెట్‌ను 9 వికెట్ల తేడాతో ఛేదించింది. పృథ్వీ షా (41; 20 బంతుల్లో 7x4, 1x6), డేవిడ్ వార్నర్ (60*; 30 బంతుల్లో 10x4, 1x6) నువ్వానేనా అన్నట్టుగా ఆడారు. కేవలం పవర్‌ప్లేలోనే 81 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లను చితకబాదారు. ఐపీఎల్ 2022లో అత్యధిక పవర్‌ప్లే స్కోరు సాధించారు. 6.3వ బంతికి షాను రాహుల్ చాహర్ ఔట్ చేసినా సర్ఫరాజ్ ఖాన్ (12*; 13 బంతుల్లో 1x4) సాయంతో వార్నర్ గెలిపించేశాడు.
దిల్లీ బౌలింగ్‌కు విలవిల
మొదట బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ కింగ్స్‌కు ఏ మాత్రం కలిసి రాలేదు. పవర్‌ప్లేలో 47 పరుగులు చేసి 3 వికెట్లు చేజార్చుకుంది. మయాంక్ అగర్వాల్ నాలుగు బౌండరీల బాదడం వల్లే ఆ మాత్రం పరుగులు వచ్చాయి. అయితే దిల్లీ బౌలర్ల సమష్టి ప్రదర్శనకు పంజాబ్ విలవిల్లాడింది. సగటున ప్రతి 10 పరుగులకు ఒక వికెట్ చేజార్చుకున్నారు. అయితే జితేశ్ శర్మ (32) ఓ ఐదు బౌండరీలు బాదడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. తొలి వికెట్‌కు ధావన్, మయాంక్ (33), ఐదో వికెట్‌కు షారుక్, జితేశ్ (31) నెలకొల్పిన భాగస్వామ్యాలే స్కోరును వంద దాటించాయి. ఖలీల్, లలిత్, అక్షర్, కుల్‌దీప్ తలో 2 వికెట్లు తీయడంతో పంజాబ్ 115కు ఆలౌటైంది.
5️⃣0️⃣ up in 2️⃣1️⃣ Balls 🔥
Most consecutive 50-run opening stands in #IPL2022 💙#YehHaiNayiDilli | #IPL2022 | #DCvPBKS | #TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/IRj3IvPtpZ — Delhi Capitals (@DelhiCapitals) April 20, 2022
Suryakumar Yadav: సూర్యకుమార్ 3 వన్డేల్లో 3 డక్స్! మర్చిపోతే మంచిదన్న సన్నీ!
IPL 2023: రెస్ట్ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్!
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!
IPL 2023: కైల్ జేమీసన్ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకున్న చెన్నై - ఎవరికి ప్లేస్ దక్కిందంటే?
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు