IPL 2022, DC vs RR: బట్లర్ బాదుడా? వార్నర్ దూకుడా? పవర్ హిట్టింగ్ మ్యాచులో నెగ్గేదెవరు?
IPL 2022, DC vs RR: ఐపీఎల్ 2022లో 34వ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడుతున్నాయి. మరి ఈ రెండు జట్లలో ఆధిపత్యం ఎవరిది?
IPL 2022 dc vs rr preview delhi capitals vs rajasthan royals head to head records : ఐపీఎల్ 2022లో 34వ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడుతున్నాయి. పుణెలో జరగాల్సిన ఈ మ్యాచును వాంఖడేకు తరలించారు. పంజాబ్‌పై సూపర్ విక్టరీ సాధించిన పంత్ సేన జోష్‌లో ఉంది. మరోవైపు టార్గెట్లను కాపాడుకుంటూ సంజూ సేన అద్భుతాలు చేస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఆధిపత్యం ఎవరిది? తుది జట్లలో ఎవరుంటారు? గెలుపు అవకాశాలేంటి? ఎవరితో ఎవరికి ముప్పుంది?
DC తుది కూర్పుతో ఇబ్బంది!
కరోనా వైరస్ వెంటాడుతున్నా దిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఆత్మనిబ్బరంతో ముందుకు సాగుతోంది. పంజాబ్ మ్యాచులో ఆ జట్టు ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. ఫైనల్ ఎలెవన్ ఎంపికలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని సరిద్దుకుంటే పంత్ సేనకు తిరుగులేదు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా వరుసగా నాలుగు మ్యాచుల్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు. కెప్టెన్ పంత్ మరింత ఫామ్‌లోకి రావాలి. కుల్‌దీప్, అక్షర్, లలిత్ యాదవ్ తమ స్పిన్‌తో ప్రత్యర్థులను అడ్డుకుంటున్నారు. శార్దూల్, ఖలీల్‌తో కూడిన పేస్ బాగుంది.
RRలో అంతా హిట్టర్లే!
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆరింట్లో నాలుగు గెలిచి మూడో స్థానంలో ఉంది. మొదట బ్యాటింగ్ చేస్తూ గెలుస్తుండటం సంజు సేన గొప్పదనం. అన్ని రంగాల్లో పటిష్ఠంగా ఉండటమే ఇందుకు కారణం. దేవదత్ పడిక్కల్‌తో కలిసి జోష్ బట్లర్ విధ్వంసాలు సృష్టిస్తున్నాడు. ఆ తర్వాత సంజు, హెట్‌మైయిర్ చూసుకుంటున్నారు. బౌలింగ్‌లో ట్రెంట్‌బౌల్ట్, ప్రసిద్ధ్ దుమ్మురేపుతున్నారు. ఇక రవిచంద్రన్ అశ్విన్‌కు యుజ్వేంద్ర చాహల్ తోడవ్వడంతో వారిని తట్టుకోవడం ప్రత్యర్థులకు సాధ్యమవ్వడం లేదు.
సమవుజ్జీలే
ఇండియన్ ప్రీమియర్ లీగులో ఈ రెండు జట్లు 24 సార్లు తలపడ్డాయి. 12-12తో రెండూ సమవుజ్జీలుగా ఉన్నాయి. చివరి ఐదు మ్యాచుల్లో దిల్లీదే ఆధిపత్యం. నాలుగు గెలిచి జోష్‌లో ఉంది. ఇప్పుడు రెండు జట్లూ సమాన బలంతో ఉండటంతో మ్యాచ్‌పై ఉత్కంఠ కలుగుతోంది.
DC vs RR Probable XI
దిల్లీ క్యాపిటల్స్ (DC Playing XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రోమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
రాజస్థాన్ రాయల్స్ (RR Playing XI): జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రన్ హెట్‌మైయిర్, కరుణ్ నాయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్‌కాయ్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
Your #DCvRR Gameday Programme is here 🗞️
— Delhi Capitals (@DelhiCapitals) April 22, 2022
Get up to speed for the perfect Friday plan with all the factoids you need to know before our Royal clash 🤩🏟️#YehHaiNayiDilli | #IPL2022#TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/QCw06aFysu
His game, ruthless.
— Rajasthan Royals (@rajasthanroyals) April 22, 2022
His demeanour, composed.
His name, Jos Buttler. 💗#RoyalsFamily | #DCvRR | @josbuttler pic.twitter.com/uq02asvdDN