IPL 7 Records: ఐపీఎల్‌లో 7 నంబర్‌తో లింక్ ఉన్న రికార్డ్‌లు ఇవే
IPL 7 Records: కొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌కు సంబంధించి 7 నంబర్ పేరుమీద ఉన్న టాప్-10 రికార్డ్‌లు ఓ సారి పరిశీలిద్దాం.
Indian Premier League: క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మరో వారంలో ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి పొట్టి సంగ్రామం అలరించనుంది. ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు గతంలో ఆటగాళ్లు, జట్లు సాధించిన రికార్డులను ఓసారి పరిశీలిద్దాం. 7 నెంబర్‌తో ఉన్న రికార్డులు ఎవరి పేరు మీద ఉన్నాయో చూద్దాం రండి.
విరాటపర్వం
ఐపీయల్ లో ఒక్క సె్చరీ కొడితేనే గఇక సీజన్ మెత్తం హీరోలు అయిపోతుంటారు. అలాంటిది ఇప్పటివరకు టోర్నీలో 7 సెంచరీలతో మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. టోర్నీ చరిత్రలో ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు. ఓపెనింగ్ వచ్చి చివరి వరకు నిలిచి సెంచరీ కొట్టడమంటే అది విరాట్‌కే సాధ్యం అనే రీతిలో డామినేషన్ ఉంటుంది కోహ్లీ బ్యాటింగ్. 237 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 7 సెంచరీలతో ఐపీయల్ చరిత్రలో రికార్డ్ బ్యాట్స్‌మెన్ అయ్యాడు.
గిల్ సంచలన్
ఐపీయల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ విభాగంలో 7వ స్థానంలో ఉన్నాడు టీమిండియా నయా సంచలనం శుభ్‌మన్‌గిల్. అహ్మదాబాద్ వేదికగా 2023 మే 26న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గిల్ ఈ స్కోర్ సాధించాడు. తనకి అచ్చొచ్చిన వేదిక మీద చెలరేగి ఆడి 60 బంతుల్లోనే 129 పరుగులు సాధించాడు. 215 స్రైక్‌రేట్ నమోదు చేశాడు గిల్. ఈ ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి.
ఇది గిల్ అడ్డా...
టీమిండియా యువబ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఐపీయల్ అత్యధిక సెంచరీల రికార్డులో కూడా 7వ స్థానంలో ఉన్నాడు. 2018లోఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ ప్లేయర్ 91 మ్యాచ్‌ల్లోనే 3 సెంచరీలు బాదేశాడు. మొదట్లో కోల్‌కతా నైట్‌రెడర్స్ తరఫున ఆడిన గిల్ ఈ సీజనఖ నుంచి గుజరా్‌టైటాన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఓపెనర్ గా వచ్చే గిల్ త్వరలోనే మరిన్ని రికార్డులు బద్దలు కొడతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నయా శ్రేయాస్
ఐపీయల్‌లో ఎక్కువ మ్యాచ్ లకు కెప్టెన్సీ చేసిన ఆటగాడి లిస్ట్ లో ఏడో స్థానంలో ఉన్నాడు టీం ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అయ్యిన అయ్యర్ మొత్తం 55 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 27 విజయాలు ఉన్నాయి. గత 2023 సీజన్‌లో వెన్నునొప్పి కారణంగా ఐపీయల్ ఆడని అయ్యర్ ఈ 2024 సీజన్‌కు అందుబాటులోకొచ్చాడు. ఈసారి తన రికార్డ్ మరింత మెరుగురపరిచే పనిలో పడ్డాడు.
భువీ మాయ
ఐపీయల్ లో ఎక్కువ వికెట్లు తీసిన వారిలో భువనేశ్వర్ కుమార్ ఏడో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2011 నుంచి ఐపీయల్ ఆడుతున్న భువీ ఇప్పటివరకు 170 వికెట్లు నేలకూల్చాడు. 160 ఇన్నింగ్స్‌లోనే భువనేశ్వర్ కుమార్ ఈ ఘనత సాధించాడు. సన్‌రైజర్స్ హైద్రాబాద్ తరఫున ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఈ స్వింగ్‌కింగ్ జట్టుకి అవసరమైనప్పుడు వికెట్లు కూల్చడం అత్యంత సులువు. 7.39 సగగలుతో పొదుపుగా బౌలింగ్‌చేయడం భువీకి అలవాటు. ఓవర్లో 6 బంతులను కూడా
వైవిధ్యంగా వేయగలడు. మరోసారి హైద్రాబాద్ కప్ ఆశలను బౌలింగ్‌లో భువీనే మోస్తున్నాడు.
రైనా ఇక్కడ...
ఐపీయల్ లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడి జాబితాలో ఏడవ స్థానంలోఉన్నాడు... మెరుపు ఫీల్డర్ సురేశ్‌రైనా. 205 మ్యాచ్ ల్లో కనిపించిన రైనా ఐపీయల్ లో మెత్తం 5528 పరుగులు సాధించాడు. 2008లోనే ఐపీయల్ ఆరంగ్రేటం చేసిన రైనా 100 పరుగుల అత్తుత్తమ వ్యక్తిగత స్కోరు సాధించాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కి 2008 నుంచి ఆడుతున్న రైనా మధ్యలో గుజరాత్ లయన్స్ తరఫున బరిలోదిగాడు
హిట్టింగ్ మేయర్
విండీస్ మిడిలార్డర్ బ్యాటర్ హెట్‌మేయర్ ఎంతటి బౌలర్‌ని అయినా లెక్క చేయకుండా ఆడగలడు. ఐపీయల్ లో ఎక్కువ స్ట్రైక్‌రేట్ కలిగిఉన్న ఆటగాళ్లలో 7వ స్థానంలో ఉన్నాడు. 152.08 స్ర్టైక్‌రేట్ కలిగిఉన్న ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ 57 ఇన్నింగ్స్ మాత్రమే ఆడి ఈ ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో మిడిలార్డర్ లో ఉండటం జట్టు బలాన్ని మరింత పెంచింది. జట్టు భారీస్కోరు సాధించింది అంటే అందులో హెట్‌మేయర్ పవర్‌హిట్టింగ్ పాత్ర ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
గుజరాజసం
7 వికెట్ల విజయంతో గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకొంది. ఈడెన్‌గార్డెన్స్ లో 2023 ఏప్రిల్ 29 న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 179 పరుగులు చేస్తే తర్వాత టైటాన్స్ జట్టు ఆడుతూ పాడుతూ 17.5 ఓవర్లలోనే మూడువికెట్లుమాత్రమే కోల్పోయి విజయాన్ని నమోదుచేసింది. దీంతో 7 వికెట్ల విజయాన్ని తన ఖాతాలోవేసుకొంది టైటాన్స్.
నిజంగా కింగ్స్
ఐపీయల్ లో అత్యధిక టీం స్కోర్ విభాగంలో ఏడవ స్థానంలో ఉంది... చెన్నై సూపర్‌కింగ్స్. ఇప్పటికే అత్యధిక స్కోరు విభాగాల్ రెండు రికార్డులు నమోదు చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ గత సీజన్‌లో మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకొంది. 2023 ఏప్రిల్ 23న జరిగిన మ్యాచ్‌లో చెన్నై నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ప్రత్యర్ధి కోల్‌కతా నైట్ రైడర్స్ పై ఈ ఫీట్ నమోదు చేసింది చెన్నై. 11.75 రన్‌రేట్ నమోదు చేసింది
సూపర్‌కింగ్స్.
పంత్ తలుచుకొంటే....
భారత డాషింగ్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్ అత్యధిక వికెట్లు తీసిన వికెట్ కీపర్ల జాబితాలో 7 వ స్థానంలో ఉన్నాడు. 98 ఇన్నింగ్స్ లో 79 వికెట్లు తన ఖాతాలో ఉన్నాయి. ఇందులో 61 క్యాచ్‌లు, 18 స్టంపింగ్ లు ఉన్నాయి. 2016లో ఐపీయల్ లో ఎంట్రీ ఇచ్చిన పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గతేడాది రోడ్డు ప్రమాదంలోగాయపడి ఇప్పుడు కోలుకొన్న రిషబ్ ఈ సారి వికెట్ కీపింగ్ చేయడు అన్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో తన రికార్డు
మెరుగుపరుచుకోవడానికి మరికొంతకాలం ఎదురుచూడక తప్పదు.