Hardik Pandya: త్వరలో పూర్తిస్థాయి కెప్టెన్‌గా హార్దిక్ - రోహిత్ అభిప్రాయం ఏంటి?
హార్దిక్ పాండ్యా త్వరలో పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడని తెలుస్తోంది.
Team India White Ball Captaincy: హార్దిక్ పాండ్యా సమీప భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకు వైట్ బాల్ కెప్టెన్‌గా మారవచ్చు. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) దీనిని పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి బీసీసీఐ అధికారి ఒకరు హార్దిక్ పాండ్యాతో ఈ ప్రణాళికపై చర్చించారు.
ఈ విషయంపై సమాధానం చెప్పేందుకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ కొంత సమయం కోరారు. ఈ ఏడాది పలు విదేశీ పర్యటనల్లో వైట్ బాల్ క్రికెట్ సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్‌ను భర్తీ చేస్తారా లేదా అనేది తెలియరాలేదు. అయితే వైట్ బాల్ జట్టు బాధ్యతలను హార్దిక్‌కు అప్పగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిశీలిస్తోంది.
ఈ విషయంలో హార్దిక్ సమాధానం కోసం బీసీసీఐ వేచిచూస్తుందని భావిస్తున్నారు. అయితే కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పడ్డాక వారితో చర్చలు జరిపిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబర్ 21న (బుధవారం) జరిగిన బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కెప్టెన్సీ అంశం చర్చకు రాలేదు.
త్వరలో టీ20 కెప్టెన్సీని అందుకోవచ్చు
హార్దిక్ పాండ్యాకు వన్డే కెప్టెన్సీ దక్కడం ఆలస్యం కావచ్చు. అయితే త్వరలో టీ20 కెప్టెన్సీ దొరుకుతుంది. జనవరిలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియాకు పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టవచ్చు. హార్దిక్‌ను టీ20 కెప్టెన్‌గా చేయడానికి రోహిత్ కూడా అనుకూలంగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ విషయంలో బీసీసీఐ అతడిని ఒప్పించింది. న్యూజిలాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్ పర్యటనల్లో టీ20ల్లో హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో అతను తన కెప్టెన్సీలో ప్రతిచోటా సిరీస్‌ను గెలుచుకోవడంలో విజయం సాధించాడు.
View this post on Instagram
View this post on Instagram