Sanju Samson: భవిష్యత్తు కెప్టెన్ శాంసన్, మీకేమైనా అనుమానాలు ఉన్నాయా?
IPL 2024, RR vs MI: మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంజుపై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ తర్వాత శాంసన్ టీమ్‌ఇండియాకు తదుపరి టీ20 కెప్టెన్‌గా ఎదుగుతాడన్నాడు.
సంజూ శాంసన్‌పై ప్రశంసల జల్లు
ముంబైతో ఘన విజయం సాధించిన అనంతరం సంజూ శాంసన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Former spinner Harbhajan Singh) సంజుపై ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచ కప్ భారత జట్టులో సంజు శాంసన్ ఉండాలని... రోహిత్ శర్మ తర్వాత శాంసన్ టీమ్‌ఇండియాకు తదుపరి టీ20 కెప్టెన్‌గా ఎదుగుతాడనడంలో మీకు ఏమైనా అనుమానాలున్నాయా అని భజ్జీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.
టీ 20 ప్రపంచకప్‌లో చోటు దక్కుతుందా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇషాన్ కిషన్ కంటే.. సంజు శాంసనే మంచి ఫామ్‌లో ఉన్నాడు. కేఎల్ రాహుల్, పంత్, శాంసన్, ఇషాన్.. వీరి నలుగురిలో వికెట్ కీపింగ్ పరంగా అంతా బాగానే చేస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం శాంసనే నిలకడగా రాణిస్తున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో మొనగాడు
ఐపీఎల్(IPL 2024)లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్(Sanju Samson) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ శతకంతో శాంసన్ చెలరేగాడు. మొత్తం 52 బంతులు ఎదుర్కొన్న సంజు శాంసన్.. 3 ఫోర్లు, 6 సిక్సులతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 50కుపైగా పరుగులు సాధించి శాంసన్ చరిత్ర సృష్టించాడు. సీజన్ తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం సాధించడం శాంసన్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో నాలుగుసార్లు శాంసన్ ఈ మార్కు అందుకున్నాడు. దీంతో వరుసగా 5 సీజన్లలో ఆరంభ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీకిపైగా పరుగలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు.
సంజు శాంసన్ 2020లో చెన్నైపై 74, 2021లో పంజాబ్ కింగ్స్‌పై 119, 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 55, 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 55, తాజాగా లక్నోసూపర్ జెయింట్స్‌పై 82 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక సార్లు 50కుపైగా స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో జోస్ బట్లర్, అజింక్య రహానేతో కలిసి శాంసన్ మొదటి స్థానంలో నిలిచాడు.