By: ABP Desam | Updated at : 16 Apr 2023 09:55 PM (IST)
వికెట్ తీసిన సందీప్ శర్మను అభినందిస్తున్న జట్టు సభ్యులు (Image credits: IPL Twitter)
Gujarat Titans vs Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్ 20వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (46: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (45: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ విజయానికి 120 బంతుల్లో 178 పరుగులు అవసరం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఫాంలో ఉన్న ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (4: 3 బంతుల్లో, ఒక ఫోర్) మొదటి ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (45: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) , వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (20: 19 బంతుల్లో, రెండు ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. కానీ ఈ జోడీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. లేని పరుగుకు ప్రయత్నించి సాయి సుదర్శన్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 32 పరుగులు మాత్రమే.
అనంతరం శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (28: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) జతకలిశాడు. వీరు మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చాలా వేగంగా ఆడాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ అవుటయ్యాక ఆ బాధ్యతను డేవిడ్ మిల్లర్ తీసుకున్నాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో డేవిడ్ మిల్లర్ (46: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) చెలరేగడం విశేషం. డేవిడ్ మిల్లర్‌కు అభినవ్ మనోహర్ (27: 13 బంతుల్లో, మూడు సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. తను కూడా సిక్సర్లతో చెలరేగాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
జాషువా లిటిల్, జయంత్ యాదవ్, నూర్ అహ్మద్, శ్రీకర్ భరత్, దాసున్ షనక
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
దేవదత్ పడిక్కల్, మురుగన్ అశ్విన్, డోనావన్ ఫెరీరా, నవదీప్ సైనీ, జో రూట్
Innings Break!@ShubmanGill & @DavidMillerSA12 powered @gujarat_titans to 177/7 along with contributions from captain @hardikpandya7 and Abhinav Manohar@rajasthanroyals will 🔜 start their chase ⌛️
— IndianPremierLeague (@IPL) April 16, 2023
Scorecard 👉 https://t.co/nvoo5Sl96y #TATAIPL | #GTvRR pic.twitter.com/3W31hpFiJW
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ