అన్వేషించండి
Advertisement
IPL 2024: రాజస్థాన్‌కు ఇచ్చిపడేశారు, కీలక మ్యాచ్‌లో ఢిల్లీ విజయం
DC vs RR LIVE Score: చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఢిల్లీ క్యాపిటల్స్- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఢిల్లీ పంజా విసిరింది. తొలుత భారీ స్కోరు చేసిన ఢిల్లీ... ఆ భారీ లక్ష్యాన్ని కాపాడుకుంది.
DC vs RR, Delhi Capitals won by 20 runs : ఢిల్లీ క్యాపిటల్స్(DC)- రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ పంజా విసిరింది. తొలుత భారీ స్కోరు చేసిన ఢిల్లీ... ఆ భారీ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న రాజస్థాన్ విజయం కోసం చివరి వరకూ పోరాడినా ఓటమి తప్పలేదు. టీ 20 ప్రపంచకప్‌కు ముందు సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి రావడం టీమిండియా అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ మెక్‌గర్క్, అభిషేఖ్ పోరెల్ మెరుపు బ్యాటింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ విజయం కోసం పోరాడినా 201 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ సంజు శాంసన్ 86 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా.... మిగిలిన రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
మళ్లీ మెరిసిన మెక్‌గర్క్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా క్రీజులో జేక్ ఫ్రెసర్, అభిషేక్ పోరెల్... ఢిల్లీకి మంచి ఆరంభం ఇచ్చారు. అవేశ్‌ఖాన్ వేసిన 4వ ఓవర్లో మెక్‌గర్క్ ఒకే ఓవర్ లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వెంటనే ఫెరెరాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ లి చేరాడు. ఫ్రెసర్ తరువాత దిగిన షై హోప్ ఒక్క పరుగుకే రనౌట్ కాగా 9 వ ఓవర్ కి ఢిల్లీ స్కోర్ వంద పరుగులు దాటింది. అశ్విన్ బౌలింగ్‌లో అక్షర్15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అశ్విన్ వేసిన పదో ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అక్షర్.... పరాగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అవేశ్‌ఖాన్ వేసిన 11వ ఓవ ర్లో పోరెల్ సిక్స్ బాది అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తరువాత 65 పరుగుల వద్ద పొరల్ అవుట్ కాగా 14 వ ఓవర్లో పంత్ కూడా 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. యుజ్వేంద్ర వేసిన 18వ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో స్టబ్స్ వరుసగా రెండు సిక్స్‌లు బాది ఔటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 65 పరుగులతో పోరెల్, 50 పరుగులతో జేక్ ఫ్రెసర్, 41 పరుగులతో స్టబ్స్ రాణించారు. ఈరోజు తొలి మ్యాచ్ ఆడుతున్న గుల్బదిన్ నాయబ్ కూడా 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 19 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్ తీయగా, బౌల్ట్, సందీప్, యుజ్వేంద్ర తలో వికెట్ పడగొట్టారు
సంజూ ఒక్కడే
అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 201 పరుగులకే పరిమితమైంది. సారధి సంజు శాంసన్ ఒక్కడే పోరాడాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 86 పరుగులు చేసిన సంజు.... రాజస్థాన్‌ను విజయానికి సమీపానికి తీసుకొచ్చాడు. రియాన్ పరాగ్ 27, దూబే 25 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion