David Warner: అరుదైన జాబితాలో డేవిడ్ వార్నర్ - అత్యంత వేగంగా ఆ రికార్డు!
ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
IPL 2023, RR vs DC: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ IPLలో ఆరు వేల పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు డేవిడ్ వార్నరే. ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు. డేవిడ్ వార్నర్ కంటే ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ కూడా ఐపీఎల్‌లో ఆరు పరుగులను పూర్తి చేశారు. ఈ మూడింటికి సంబంధించిన కొన్ని రికార్డుల గురించి తెలుసుకుందాం.
ఐపీఎల్ 16వ సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నప్పుడు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో ఆరు వేల పరుగుల మార్కును అధిగమించాడు. డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో మొత్తం 165 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ మైలు రాయిని చేరుకున్నాడు.
ఆరు వేల పరుగులు పూర్తి చేసిన వార్నర్
డేవిడ్ వార్నర్ 2009 నుండి IPL ఆడుతున్నాడు. ఈ సమయంలో అతను 165 మ్యాచ్‌లలో 165 ఇన్నింగ్స్‌లలో 42.33 సగటు, 140.04 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 6,012 పరుగులు చేశాడు. ఈ సమయంలో డేవిడ్ వార్నర్ నాలుగు సెంచరీలు, 56 అర్ధ సెంచరీలు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 126 పరుగులు.
డేవిడ్ వార్నర్ కంటే ముందు విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ తన 188వ ఇన్నింగ్స్‌లో ఆరు వేల పరుగుల మార్కును దాటాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 225 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 217 ఇన్నింగ్స్‌లు ఆడి మొత్తంగా 6,727 పరుగులు చేశాడు.
ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ పేరు ఈ జాబితలో రెండో స్థానంలో ఉంది. అతను తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 208 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 207 ఇన్నింగ్స్‌లలో మొత్తం 6,370 పరుగులు చేశాడు. గబ్బర్‌గా పేరుగాంచిన ఈ ఆటగాడు తన 199వ ఇన్నింగ్స్‌లో ఆరు వేల పరుగులను పూర్తి చేశాడు.
అయితే డేవిడ్ వార్నర్ ఈ సంవత్సరం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. రిషబ్ పంత్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. దీంతో ఢిల్లీకి కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం అతని బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రాలేదు.
.@davidwarner31 leading from the front once again with a FIFTY 👌👌#DC need a special finish with the bat as they require 82 off 27!
— IndianPremierLeague (@IPL) April 8, 2023
Follow the match ▶️ https://t.co/FLjLINwRJC#TATAIPL | #RRvDC pic.twitter.com/O83D2j5jax
Milestone unlocked 🔓@davidwarner31 completes 6️⃣0️⃣0️⃣0️⃣ runs in the IPL 🫡#TATAIPL | #RRvDC pic.twitter.com/7PkLNTVpcY
— IndianPremierLeague (@IPL) April 8, 2023
Nothing but respect for our Skipper 👏#YehHaiNayiDilli #IPL2023 #RRvDC @davidwarner31 pic.twitter.com/AiWsd6WuZf
— Delhi Capitals (@DelhiCapitals) April 8, 2023
This 𝐁𝐔𝐋𝐋 gives you runs 😉
— Delhi Capitals (@DelhiCapitals) April 8, 2023
Just 1️⃣6️⃣5️⃣ matches to reach this extraordinary milestone 🤯#YehHaiNayiDilli #IPL2023 #RRvDC @davidwarner31 pic.twitter.com/eStFiyNsNc