News
News
వీడియోలు ఆటలు
X

CSK Vs PBKS: గెలిచినా, ఓడినా ఒకే కూర్పు - తుదిజట్టులో మార్పులు చేయని చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

FOLLOW US: 
Share:

Punjab Kings vs Chennai Super Kings: ఐపీఎల్‌ 2023 సీజన్ 41వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట పంజాబ్ కింగ్స్ (PBKS) బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టులో ఒక్క మార్పు కూడా చేయలేదు. గత మ్యాచ్‌లో ఓటమి పాలైనా అదే జట్టుతో బరిలోకి దిగనుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. గుర్నూర్ బ్రార్ స్థానంలో హర్‌ప్రీత్ బ్రార్ జట్టులోకి వచ్చాడు.

పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలోనూ, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ తేడాతో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. అదే పంజాబ్ గెలిస్తే వారు ఐదో స్థానానికి వెళ్తారు. ఒకవేళ భారీ తేడాతో గెలిస్తే పంజాబ్ టాప్ 4లో అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ఆకాష్ సింగ్, డ్వేన్ ప్రిటోరియస్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, రాజ్‌వర్థన్ హంగర్గేకర్

పంజాబ్ కింగ్స్ తుది జట్టు
అథర్వ తైదే, శిఖర్ ధావన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, సికందర్ రజా, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ప్రభ్‌సిమ్రన్ సింగ్, మాథ్యూ షార్ట్, రిషి ధావన్, మోహిత్ రాథీ, శివం సింగ్

ఐపీఎల్-2023 ఎడిషన్ లో భాగంగా నేడు మరో సూపర్ సండేకు  రంగం సిద్ధమైంది. ప్లేఆఫ్స్ దిశగా ముందుకు సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. అదే దిశలో వస్తున్న పంజాబ్ కింగ్స్‌లు నేడు మధ్యాహ్నం  3.30 గంటలకు  చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ ఇరు జట్లూ తాము ఆడిన గత మ్యాచ్‌లలో ఓడినవే. 

వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన చెన్నైకి రాజస్తాన్ రాయల్స్  షాకిచ్చింది.  ఈనెల 27న జైపూర్ లో వాళ్ల సొంతగడ్డపై  రాజస్తాన్.. చెన్నైని నిలువరించింది.  దీంతో ఈ మ్యాచ్ తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది.  కానీ  నేడు స్వంత గ్రౌండ్ (చెపాక్)లో జరుగబోయే మ్యాచ్ లో పుంజుకుని  టాప్ -2 కు చేరుకోవాలని చూస్తున్నది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న ఈ సీజన్ లో ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్ ముఖ్యమే కాబట్టి  చెపాక్ లో పంజాబ్ కు చెక్ పెట్టేందుకు ధోని సేన రంగం సిద్ధం చేసుకుంటున్నది.

ఆ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రహానే, శివమ్ దూబే లతో టాపార్డర్ పటిష్టంగానే ఉంది. మిడిలార్డర్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్న అంబటిరాయుడు విఫలమవుతుండటం చెన్నైని కలవరపరిచేదే.  చివర్లో రవీంద్ర జడేజా, ధోని లు హిట్టింగ్ చేస్తే  చెపాక్ లో భారీ స్కోరు  పక్కా.  బౌలింగ్ లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేనప్పటికీ ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, పతిరానలతో ధోని అద్భుతాలు చేయిస్తున్నాడు. 

Published at : 30 Apr 2023 03:18 PM (IST) Tags: CSK Punjab Kings PBKS IPL CSK vs PBKS IPL 2023 Chennai Super Kings Indian Premier League 2023 IPL 2023 Match 41

సంబంధిత కథనాలు

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

టాప్ స్టోరీస్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News :  రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్