అన్వేషించండి
Advertisement
IPL 2024: సెంచరీతో రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్, లక్నో లక్ష్యం 211
CSK vs LSG IPL 2024: చెన్నై బ్యాటర్లు రుతురాజ్, శివమ్ బౌండరీలతో విరుచుకుపడడంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. చివరి బంతికి ధోనీ ఫోర్‌తో ముగించాడు.
CSK vs LSG IPL 2024 Lucknow target 211: కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ శతకంతో చెలరేగిన వేళ లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) భారీ స్కోరు చేసింది. గైక్వాడ్‌కుతోడు శివమ్ దూబే మెరుపు బ్యాటింగ్ చేయడంతో... చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే అజింక్యా రహానే అవుటైనా చివరి వరకూ క్రీజులో నిలబడ్డ రుతురాజ్.... అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. దూబే అర్ధ శతకంతో మెరిశాడు. లక్నో(LSG) బౌలర్లలో హెన్రీ, యష్ ఠాకూర్, మోహిన్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.
చెలరేగిన రుతురాజ్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు... తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఈ సీజన్‌లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న అజింక్యా రహానే ఈ మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. హెన్రీ వేసిన తొలి ఓవర్ చివరి బంతికే రహానే అవుటయ్యాడు. రహానే మూడు బంతుల్లో ఒకే పరుగు చేసి రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో నాలుగు పరుగుల వద్దే చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం డేరిల్ మిచెల్ కూడా 11 పరుగులు, రవీంద్ర జడేజా 17 పరుగులకే వెనుదిరగడంతో చెన్నై కష్టాల్లో పడింది.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 23, 2024
Ruturaj Gaikwad leads from the front with a TON as @ChennaiIPL reach 210/4 🙌
Can #LSG chase this down?
Follow the Match ▶️ https://t.co/MWcsF5FGoc#TATAIPL | #CSKvLSG pic.twitter.com/IiOvwuWVtq
కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జత కలిసిన శివమ్ దూబే చెన్నై స్కోరు వేగాన్ని పెంచాడు. రుతురాజ్ 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సులతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శివమ్ దూబే 27 బంతుల్లోనే 3 ఫోర్లు, ఏడు భారీ సిక్సులతో 66 పరుగులు చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్‌తో న్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో హెన్రీ, యష్ ఠాకూర్, మోహిన్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.
లక్నోకు బ్యాటింగ్ సమస్య
లక్నోను బ్యాటింగ్ సమస్య వేధిస్తోంది. క్వింటన్ డికాక్, రాహుల్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్‌లు ఉన్నా భారీ స్కోర్లు నమోదు చేయడంలో లక్నో తడబడుతోంది. పూరన్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని లక్నో కోరుకుంటోంది. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగితే లక్నో బౌలింగ్ బలోపేతం అవుతోంది.
హెడ్ టు హెడ్ రికార్డులు
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ లక్నో-చెన్నై సూపర్‌కింగ్స్ నాలుగు మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఒక విజయం సాధించగా.. లక్నో సూపర్ జెయింట్స్ రెండు మ్యాచుల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రాహుల్ అత్యధిక పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లోనూ రాహుల్ 82 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. తర్వాత చెన్నై ప్లేయర్ మొయిన్ అలీ 44 , దూబే 79 పరుగులు, CSK కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 65 పరుగులతో రాణఇించారు. 2023 సీజన్ 6వ మ్యాచ్‌లో లక్నోపై చెన్నై అత్యధిక స్కోరును నమోదు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై... రుతురాజ్ గైక్వాడ్- డెవాన్ కాన్వే 110 పరుగుల భాగస్వామ్యంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో లక్నో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2022 సీజన్‌లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో లక్నో చెన్నై అత్యల్ప స్కోరు చేసింది. రాబిన్ ఉతప్ప హాఫ్ సెంచరీ, శివమ్ దూబే 49 పరుగులతో చెన్నై 210 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, ఎవిన్ లూయిస్ త్రయం మెరుపులు మెరిపించడంతో లక్నో చివరి ఓవర్‌లో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement