IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్ స్టాయినిస్
CSK vs LSG IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం సాధించింది . 210 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
CSK vs LSG IPL 2024 Lucknow Super Giants won by 6 wkts: చివరి బాల్ వరకు ఉత్కంఠతో జరిగిన మ్యాచ్ లో చెన్నై(CSK)పై లఖ్‌నవూ (LSG) విజయం సాధించింది . తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటర్ మార్కస్ స్టాయినిస్ అద్భుత శతకంతో అదరగొట్టాడు.
ఒకానొక సమయంలో మ్యాచ్ చెన్నై వైపు ఉన్నట్టు అనిపించినా సమయంలో సీఎస్కే బౌలర్లపై స్టోయినీస్ విరుచుకుపడ్డాడు. మార్కస్ 63 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి. పూరన్ 14 బంతుల్లో 34 పరుగులు చేయగా చివర్లో దీపక్ హూడా 6 బంతుల్లో 17 రన్స్ తో జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై బౌలర్లలో పతిరన 2, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1, దీపక్ చాహర్ 1 వికెట్ తీశారు.