News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CSK vs GT Final: కాన్వే, రుతురాజ్‌కు షమీ అంటే దడే! మోహిత్ శర్మకు ధోనీ భయం!

CSK vs GT Final: ఐపీఎల్‌ 2023 ఫైనల్లో ఢీకొంటున్న గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య ఇంట్రెస్టింగ్‌ రైవల్రీ కొనసాగుతోంది! కొందరు ఆటగాళ్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది.

FOLLOW US: 
Share:

CSK vs GT Final:

ఐపీఎల్‌ 2023 ఫైనల్లో ఢీకొంటున్న గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK vs GT Final) మధ్య ఇంట్రెస్టింగ్‌ రైవల్రీ కొనసాగుతోంది! కొందరు ఆటగాళ్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని పట్టుదలగా ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఆధిపత్యం వహిస్తారో, ఎవరు తేలిపోతారో చూడాలి!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వేపై గుజరాత్ టైటాన్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమికి అద్భుతమైన రికార్డు ఉంది. అతడి బౌలింగ్‌లో కాన్వే మూడు ఇన్సింగ్సుల్లో 12 బంతులాడి ఐదు పరుగులే చేశాడు. మూడు సార్లు ఔటయ్యాడు. గైక్వాడ్‌ వికెట్‌ ఇవ్వనప్పటికీ 69.69 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. 66 బంతుల్లో 46 మాత్రమే కొట్టాడు. పైగా షమీకి అహ్మదాబాద్‌లో అమేజింగ్‌ రికార్డ్‌ ఉంది. 6.77 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు.

రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడుకి రషీద్‌ ఖాన్‌పై మంచి రికార్డు ఉంది. వారిద్దరూ అతడి బౌలింగ్‌ను ఉతికారేస్తారు. రషీద్‌పై గైక్వాడ్‌కు 147.36 స్ట్రైక్‌రేట్‌ ఉంది. ఆరు మ్యాచుల్లో 57 బంతుల్లో 84 పరుగులు చేశాడు. రెండుసార్లే ఔటయ్యాడు. ఇక రాయుడికి 124.65 స్ట్రైక్‌రేట్‌ ఉంది. 73 డెలివరీల్లో రెండుసార్లు మాత్రమే ఔటయ్యాడు.

టైటాన్స్‌ అంబటి రాయుడిపై మోహిత్‌ శర్మను ప్రయోగించనుంది. అతడి బౌలింగ్లో 44 బంతులు ఎదుర్కొన్న రాయుడు కేవలం 54 పరుగులే చేసి ఆరుసార్లు ఔటయ్యాడు. అయితే ధోనీకి అతడిపై మంచి రికార్డు ఉంది. 24 బంతుల్లో 48 రన్స్‌ కొట్టి రెండుసార్లు పెవిలియన్‌ చేరాడు.

తొలి క్వాలిఫయర్లో డేవిడ్‌ మిల్లర్‌ను రవీంద్ర జడేజా కేవలం 4 పరుగులకే ఔట్‌ చేశాడు. అయితే అతడి బౌలింగ్లో మిల్లర్‌ 168.05 స్ట్రైక్‌రేట్‌తో 121 పరుగులు చేశాడు. కాగా టీ20 క్రికెట్లో శుభ్‌మన్‌ గిల్‌ను జడ్డూ అస్సలు ఔట్‌ చేయలేదు. పైగా 48 బంతుల్లోనే 68 పరుగులు ఇచ్చాడు. గిల్‌ స్ట్రైక్‌రేట్‌ 141.66.

చెన్నై స్పిన్నర్‌ మహీశ్ తీక్షణ ప్రత్యర్థుల హోమ్‌ గ్రౌండ్స్‌లో మంచి ప్రదర్శన చేశాడు. చెన్నైలో ఆడిన ఏడు మ్యాచుల్లో 3 వికెట్లు తీసిన అతడు ఇతర వేదికల్లో ఐదు మ్యాచుల్లోనే 8 వికెట్లు పడగొట్టాడు.

ఒక ఐపీఎల్‌ సీజన్లో అత్యధిక పరుగుల రికార్డుకు శుభ్‌మన్‌ గిల్‌ 123 పరుగుల దూరంలో నిలిచాడు. విరాట్‌ కోహ్లీ స్కోరును బీట్‌ చేయాలంటే పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాల్సిందే.

ఈ ఐపీఎల్‌ సీజన్లో మహ్మద్‌ షమి (28), రషీద్‌ (27), మోహిత్‌ శర్మ (24) టాప్‌ వికెట్‌ టేకర్స్‌. ఒక సింగిల్‌ ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు హర్షల్‌ పటేల్‌, డ్వేన్ బ్రావో. వీరిద్దరూ 33 వికెట్లు పడగొట్టారు. ఈ రికార్డుకు షమి ఐదు వికెట్ల దూరంలో ఉన్నాడు.

Also Read: మొతేరాలో ఫైనల్‌ మోత! సీఎస్కే, జీటీ పాజిటివ్‌, నెగెటివ్స్‌ ఇవే!

Also Read: ఆడిన ప్రతి ఫైనల్ గెలిచిన పాండ్య - 11వ ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడుతున్న ధోనీ!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్.

గుజరాత్ టైటాన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.

Published at : 28 May 2023 12:48 PM (IST) Tags: CSK Vs GT IPL 2023 IPL 2023 Final IPL 2023 Final Live CSK vs GT Final

ఇవి కూడా చూడండి

R Ashwin: 'ఐపీఎల్‌ వార్‌ఫేర్‌'పై స్పందించిన యాష్‌ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్‌

R Ashwin: 'ఐపీఎల్‌ వార్‌ఫేర్‌'పై స్పందించిన యాష్‌ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్‌

Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్‌ పదవికి గంభీర్ రిజైన్‌ చేస్తున్నాడా!

Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్‌ పదవికి గంభీర్ రిజైన్‌ చేస్తున్నాడా!

IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?

IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?

Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు

Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు

MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?

MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!