CSK vs GT IPL 2023 Final: మొతేరాలో ఫైనల్ మోత! సీఎస్కే, జీటీ పాజిటివ్, నెగెటివ్స్ ఇవే!
CSK vs GT IPL 2023 Final: గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మొతేరాలో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. మరి విజయం సాధించేదెవరు? రికార్డులు తిరగరాసేది ఎవరు? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
CSK vs GT IPL 2023 Final:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఆఖరి అంకానికి చేరుకుంది. ఎక్కడ.. ఎలా మొదలైందో అచ్చం అలాగే ముగుస్తోంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మొతేరాలో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. మరి విజయం సాధించేదెవరు? రికార్డులు తిరగరాసేది ఎవరు? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
బిగ్ మ్యాచ్ టీమ్.. సీఎస్కే!
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటి వరకు నాలుగు ట్రోఫీలు గెలిచింది. ఇప్పుడు ఐదోది గెలిచి ముంబయి ఇండియన్స్ రికార్డును సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే మొతేరాలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలవ్వడం నెగెటివ్ సెంటిమెంట్‌గా మారింది. దాంతో జట్టు పూర్తిగా ఎంఎస్ ధోనీ వ్యూహాలనే నమ్ముకొంది. మహ్మద్ షమీ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వేకు మెరుగైన రికార్డు లేదు. వారెలాంటి ఓపెనింగ్ ఇస్తారనేది చూడాలి. మిడిలార్డర్లో శివమ్ దూబె, అజింక్య రహానె మంచి ఇంటెట్ చూపిస్తున్నారు. రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తిరుగులేని విధంగా ఆడుతున్నాడు. పైగా దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్రకు ఆడే ప్లేయర్. అందుకే మోదీ స్టేడియం అతడికి కొట్టిన పిండి! మతీశ పతిరణ, దేశ్‌పాండే, దీపక్ చాహర్ బౌలింగ్ కీలకం కానుంది.
Get 𝗥𝗘𝗔𝗗𝗬 to experience the visual extravaganza! 👏 👏
— IndianPremierLeague (@IPL) May 28, 2023
DO NOT MISS the IPL MID SHOW in the #TATAIPL 2023 Grand Finale! 🎥 😎#GTvCSK pic.twitter.com/W5OGC9itQg
హై జోష్‌లో టైటాన్స్!
సీఎస్కేకు చెపాక్ ఎలాగో టైటాన్స్‌కు మొతేరా అలాగే! ఇక్కడ ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఆరు గెలిచింది. అదీ భారీ స్కోర్లు చేయడం ద్వారానే! అందుకే ఇక్కడ కుంగ్ ఫూ పాండ్య సేనను ఓడించడం చెన్నైకి సులభమేమీ కాదు! ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలు రచించాలి. చెపాక్ తరహా స్లో టర్నర్లు ఇక్కడ ఉండవు. బంతి.. బ్యాటుపైకి చక్కగా వస్తుంది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను ఎదుర్కోవడం ఈజీ కాదు! అతడు నిలబడితే మరో సెంచరీ చేయడం ఖాయం. వృద్ధిమాన్ సాహా అతడికి అండగా నిలవాలి. సాయి సుదర్శన్ సైతం మంచి ఇన్నింగ్సులు ఆడుతున్నాడు. క్వాలిఫయర్-2లో హార్దిక్ మంచి ఇంటెంట్ చూపించాడు. పైగా బౌలింగ్ చేశాడు. మిడిలార్డర్లో డేవిడ్ మిల్లర్, తెవాతియా, రషీద్ ఉన్నారు. విజయ్ శంకర్‌ను మరిచిపోవద్దు! ఇక బౌలింగ్ పరంగా గుజరాత్‌ను ఢీకొట్టే టీమ్ కనిపించడం లేదు. రషీద్, నూర్ అహ్మద్ వికెట్లు తీస్తూ పరుగుల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ వారిని అటాక్ చేసినా మహ్మద్ షమి, మోహిత్ శర్మను ఆడటం కష్టంగా మారింది. జోష్ లిటిల్ రూపంలో మరో మంచి పేసర్ ఉన్నాడు. ముంబయిపై విజయంతో టైటాన్స్ జోష్‌లో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్.
గుజరాత్ టైటాన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.