News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది.

FOLLOW US: 
Share:

IPL 2023 Final Reserve Day CSK vs GT: IPL 2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం ఆడలేదు. ఇకపై సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సోమవారం ఫైనల్‌కు రిజర్వ్‌ అయింది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం ఆటను చెడగొట్టింది. ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా చాలా సేపు వర్షం ఆగుతుందా అని ఎదురుచూశారు. కానీ వర్షం ఆగలేదు.

వర్షం కారణంగా ఆదివారం చెన్నై గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగలేదు. ఈ మేరకు ఐపీఎల్‌ ఓ ట్వీట్‌ చేసింది. "ఐపీఎల్ 2023 ఫైనల్ రేపు, మే 29వ తేదీ (రిజర్వ్డ్ డే) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఈరోజు టిక్కెట్లు రేపటికి కూడా చెల్లుబాటు అవుతాయి. వాటిని సురక్షితంగా ఉంచమని మేం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము." అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.

ఐపీఎల్ చరిత్రలో రిజర్వ్ డే రోజున ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఐపీఎల్‌ ఫైనల్‌కు సంబంధించి చాలా రకాల నిబంధనలను రూపొందించింది. వర్షం ప్రభావిత మ్యాచ్‌లలో ఓవర్లు కట్ చేస్తారు. 11 గంటల లోపు వర్షం ఆగి ఉంటే మ్యాచ్ ప్రారంభం అయ్యేది. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా సాధ్యం అయ్యేది. ఇది కూడా లేకపోతే సూపర్ ఓవర్ కూడా జరిగి ఉండేది. కానీ వర్షం కొనసాగింది. ఈ కారణంగా ఇది రిజర్వ్ డేకి మారింది. ఫైనల్ మ్యాచ్‌కు మరో రోజు కేటాయించారు.

ఐపీఎల్‌ 2023 ఫైనల్లో ఢీకొంటున్న గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK vs GT Final) మధ్య ఇంట్రెస్టింగ్‌ రైవల్రీ కొనసాగుతోంది! కొందరు ఆటగాళ్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని పట్టుదలగా ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఆధిపత్యం వహిస్తారో, ఎవరు తేలిపోతారో చూడాలి!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వేపై గుజరాత్ టైటాన్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమికి అద్భుతమైన రికార్డు ఉంది. అతడి బౌలింగ్‌లో కాన్వే మూడు ఇన్సింగ్సుల్లో 12 బంతులాడి ఐదు పరుగులే చేశాడు. మూడు సార్లు ఔటయ్యాడు. గైక్వాడ్‌ వికెట్‌ ఇవ్వనప్పటికీ 69.69 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. 66 బంతుల్లో 46 మాత్రమే కొట్టాడు. పైగా షమీకి అహ్మదాబాద్‌లో అమేజింగ్‌ రికార్డ్‌ ఉంది. 6.77 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు.

రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడుకి రషీద్‌ ఖాన్‌పై మంచి రికార్డు ఉంది. వారిద్దరూ అతడి బౌలింగ్‌ను ఉతికారేస్తారు. రషీద్‌పై గైక్వాడ్‌కు 147.36 స్ట్రైక్‌రేట్‌ ఉంది. ఆరు మ్యాచుల్లో 57 బంతుల్లో 84 పరుగులు చేశాడు. రెండుసార్లే ఔటయ్యాడు. ఇక రాయుడికి 124.65 స్ట్రైక్‌రేట్‌ ఉంది. 73 డెలివరీల్లో రెండుసార్లు మాత్రమే ఔటయ్యాడు.

Published at : 28 May 2023 11:06 PM (IST) Tags: Dhoni Gujarat Titans CSK Vs GT IPL 2023 ABP Desam Chennai Super Kings breaking news IPL 16 IPL 2023 Final

ఇవి కూడా చూడండి

R Ashwin: 'ఐపీఎల్‌ వార్‌ఫేర్‌'పై స్పందించిన యాష్‌ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్‌

R Ashwin: 'ఐపీఎల్‌ వార్‌ఫేర్‌'పై స్పందించిన యాష్‌ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్‌

Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్‌ పదవికి గంభీర్ రిజైన్‌ చేస్తున్నాడా!

Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్‌ పదవికి గంభీర్ రిజైన్‌ చేస్తున్నాడా!

IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?

IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?

Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు

Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు

MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?

MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ