Biggest Fights In IPL History: చెంపదెబ్బ, బ్యాట్ విసిరేయడం సహా IPL చరిత్రలోనే 5 అతిపెద్ద వివాదాలు ఇవే
IPL 2025 News | దిగ్వేశ్ రాఠీ, అభిషేక్ శర్మల మధ్య గొడవ జరగడంతో ఐపీఎల్ చరిత్రలో టాప్ 5 గొడవలు ఏంటి, ఎవరి మధ్య జరిగాయని క్రికెట్ ప్రేమికులు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకూ 3 జట్లు గుజరాత్ టైటాన్స్ (GT), ఆర్సీబీ (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. అదే సమయంలో ఐదు జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తరువాత దశకు క్వాలిఫై కాలేదు. అయితే ప్లే ఆఫ్స్ కోసం ఉన్న ఒక్క స్థానానికి 2 జట్లు DC, MI పోటీ పడుతున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడటంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్‌లో దిగ్వేశ్ సింగ్ రాఠీ, అభిషేక్ శర్మల మధ్య వాగ్వివాదం జరిగింది. అభిషేక్ ఔట్ అయ్యాక లక్నో స్పిన్నర్ దిగ్వేష్ పేపర్లో రాసినట్లు చేయగా వివాదం మొదలైంది ఇది చాలా పెద్ద వివాదానికి దారితీసింది. క్రికెట్‌ను జెంటిల్‌మెన్ గేమ్ అంటారు కానీ చాలాసార్లు ఆటగాళ్ళు తమ సహనం కోల్పోతారు. కొన్ని సందర్భాలలో చేయి చేసుకునే దాకా వెళ్తారు. అయితే IPL చరిత్రలోని 5 అతిపెద్ద వివాదాల గురించి ఇక్కడ అందిస్తున్నాం.
MS ధోని కోపంగా ఉన్నప్పుడు మీరు చాలా తక్కువగా చూశారు, కానీ 2019లో అభిమానులు ధోనీ ఉగ్ర రూపాన్ని చూశారు. నిర్ణయం సరిగా లేదంటూ ధోనీ మైదానంలోపలికి వెళ్లి అంపైర్‌పై వాదించాడు. డగ్అవుట్ నుంచి వచ్చి మైదానంలోకి వెళ్లి అంపైర్‌తో వాదించడం ప్రారంభించాడు. దాంతో మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. KKR యజమాని షారుఖ్ ఖాన్ ఒకసారి వాంఖేడేలో గార్డుతో గొడవ పడ్డాడు. ఇక్కడ ఆటగాళ్ళ మధ్య జరిగిన 5 అతిపెద్ద వివాదాలు తెలుసుకోండి.
కీరన్ పోలార్డ్, మిచెల్ స్టార్క్ మధ్య వివాదం
IPL 2014లో ముంబై బ్యాటర్ కీరన్ పోలార్డ్, ఆర్సీబీ బౌలర్ మిచెల్ స్టార్క్ మధ్య తీవ్రమైన వాదన జరిగింది. ఇది ఎంతదాకా వెళ్లిందంటే పోలార్డ్ మైదానంలో స్టార్క్ వైపు బ్యాట్ విసిరేయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. RCB vs MI మ్యాచ్‌లో స్టార్క్ ముంబై బ్యాటర్ పోలార్డ్‌కు బౌన్సర్ వేశాడు. అంతటితో ఆగకుండా పోలార్డ్ వద్దకు వెళ్లి ఏదో అన్నాడు. తరువాత బంతికి పోలార్డ్ క్రీజ్ వదిలి బంతిని ఆడలేదు, కానీ స్టార్క్ ఆగలేదు. ఈసారి అతని కాళ్ళ వైపు బాల్ విసిరగా, అప్పుడు పోలార్డ్ బ్యాట్ విసిరాడు. లక్ బాగుండీ స్టార్క్‌కు బ్యాట్ తగలలేదు. ఈ వివాదం తర్వాత పోలార్డ్‌పై 75 శాతం, కవ్వించిన స్టార్క్‌పై 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు.
విరాట్ కోహ్లీ, గౌతమ్ గాంభీర్
ఒకసారి విరాట్ కోహ్లీ, లక్నో బౌలర్ నవీన్ మధ్య జరిగిన వాదన వివాదానికి దారితీసింది. అంతకుముందు 2013లో కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్రమైన వివాదం జరిగింది. ఆ సమయంలో కోహ్లీ RCBకి, గంభీర్ KKR కెప్టెన్లు. ఒక మ్యాచ్ సమయంలో కోహ్లీ ఔటై వెళ్తున్నప్పుడు గంభీర్ ఏదో అన్నాడు. దాంతో కోహ్లీకి కోపం వచ్చింది. పెవిలియన్ వెళ్తున్న కోహ్లీ ఆగి.. ఏం అంటున్నావని అడిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాదన మొదలైంది. సహచర ఆటగాళ్లు, అంపైర్ వారిద్దరినీ వేరు చేశారు. ఈ వివాదం చాలా సంవత్సరాలపాటు అభిమానులకు గుర్తుండే ఉంటుంది.
Remember the 2013 face-off between Kohli and Gambhir! 😡
— Radha (@Radha4565) April 16, 2025
Kohli tried to be the Hero,but Gambhir humbled him. 😂
Kohli's face after the incident though 😭😭 pic.twitter.com/UD1PWD5APT
శ్రీశాంత్‌కు హర్భజన్ సింగ్ చెంపదెబ్బ
IPL 2008లో ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ పంజాబ్ కింగ్స్ (అప్పట్లో కింగ్స్ పంజాబ్) ఆటగాడు శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు. శ్రీశాంత్ స్టేడియంలోనే ఏడుస్తూ కనిపించాడు. ఆ సమయంలో హర్భజన్‌పై బీసీసీఐ 11 మ్యాచ్‌ల నిషేధం విధించింది. అతనిపై మ్యాచ్ ఫీజు కట్ చేయడంతో పాటు జరిమానా విధించారు. అలా చేయకూడ ఉండాల్సిందని కొన్నేళ్ల తరువాత హర్భజన్ అంగీకరించాడు.
విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ
IPL 2023లో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ లో భాగంగా నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య గొడవ జరిగింది. కోహ్లీ నవీన్‌కు షూ డస్ట్ తీసి చూపించాడు. తర్వాత విషయం మరింత పెద్దమైంది. మ్యాచ్ ముగిశాక షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తున్న కోహ్లీ చేతిని నవీన్ పట్టుకున్నాడు. దాంతో వారి మధ్య గొడవ మొదలు కాగా, లక్నో మెంటార్ గంభీర్ సైతం వివాదంలో తలదూర్చాడు. నీకేం పని అని కోహ్లీ అడగగా.. నా ఆటగాడు కనుక మద్దతుగా మాట్లాడతా అని గంభీర్ బదులివ్వడం తెలిసిందే. తరువాత లక్నో బెంగళూరుపై మ్యాచ్ గెలిచిన సమయంలో బౌలర్ ఆవేష్ ఖాన్ తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. అదే సమయంలో గంభీర్ స్టేడియంలో ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉండమంటూ ముక్కుమీద వేలు వేసుకుని చూపించాడు. ఈ వివాదం అప్పుడప్పుడు చర్చకు వస్తుంది.
Virat Kohli & Gautam Gambhir have been fined 100% of match fees and Naveen Ul Haq has been fined 50% of match fees for breaching IPL code of conduct. pic.twitter.com/ya6b31IZ45
— Johns. (@CricCrazyJohns) May 2, 2023
దిగ్వేశ్ రాఠీ, అభిషేక్ శర్మల మధ్య వివాదం
లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీ ఇప్పటివరకూ రెండుసార్లు నోట్‌బుక్ సెలబ్రేషన్ చేసుకుంటే జరిమానా విధించారు. అయినా వీలు చిక్కినప్పుడల్లా తను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సెలబ్రేషన్ కారణంగానే సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో గొడవ జరిగింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మను ఔట్ చేసిన తరువాత లక్నో బౌలర్ దిగ్వేశ్ అదే సెలబ్రేషన్ చేసి, చేతులతో సూచిస్తూ అభిషేక్‌ను వెళ్ళిపోమన్నాడు. దాంతో పిలక జాగ్రత్త అనేలా అభిషేక్ బదులిచ్చాడు. వీరి మధ్య వాదన పెరగడంతో అంపైర్, ఇతర ఆటగాళ్ళు వారిని సుమదాయించారు. రాజీవ్ శుక్లా వారికి సర్ది చెప్పాల్సి వచ్చింది. మంగళవారం నాడు అభిషేక్ ఫీజులో 25 శాతం, దిగ్వేష్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది బీసీసీఐ. మరో డీమెరిట్ పాయింట్ సైతం ఇవ్వడంతో ఐపీఎల్ నియామవళి ప్రకారం అతడి లిమిట్ దాటిపోవడంతో ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం సైతం పడింది.





















