Abhishek Sharma- Digvesh Rathi: అభిషేక్ శర్మతో గొడవ లక్నో బౌలర్ దిగ్వేష్ రాఠీకి బీసీసీఐ బిగ్ షాక్, జరిమానాతో పాటు నిషేధం!
IPL 2025 LSG vs SRH | ఐపీఎల్ 2025లో అభిషేక్ శర్మతో గొడవపడిన లక్నో బౌలర్ దిగ్విజయ్ రాఠీ ఖాతాలో డీమెరిట్ పాయింట్లు ఎక్కువ కావడంతో జరిమానాతో పాటు మ్యాచ్ నిషేధం పడింది.

BCCI Fine on Digvesh Singh Rathi and Abhishek Sharma: ఇకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన IPL 2025 61వ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, దిగ్వేశ్ సింగ్ రాఠీ మధ్య వివాదం నెలకొంది. ఇద్దరు ఆటగాళ్లు నోటికి పని చెప్పారు. అంపైర్లు, జట్ల తోటి ఆటగాళ్ళు వారిని ఆపకపోతే పరిస్థితి ఇంకా దిగజారేది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ 8వ ఓవర్ మూడవ బంతికి సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మను ఔట్ చేశాడు. తర్వాత తన నోట్‌బుక్ సెలబ్రేషన్ చేయడంతో గొడవ మొదలైంది. పేపర్లో రాసిపెట్టాను, ఇక నువ్వు వెళ్లిపో అన్నట్లు బౌలర్ దిగ్వేష్ చేసిన చర్యతో అభిషేక్ శర్మకు కోపం వచ్చింది. దాంతో ఇరువురి మధ్య హీటింగ్ వాగ్వాదం జరిగింది. అయితే ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించడంతో బీసీసీఐ చర్యలు చేపట్టింది. దిగ్వేశ్‌కు ఇంతకు ముందు ఎవరికీ ఇవ్వని విధంగా శిక్ష విధించి షాకిచ్చింది.
IPL విడుదల చేసిన ప్రకటనలో, " లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇకానా క్రికెట్ స్టేడియంలో సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ IPL నియమావళిని ఉల్లంఘించాడు. అందుకుగానూ అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాం" అని తెలిపింది. ఓ మ్యాచ్ సైతం నిషేధం విధించింది.
🚨 DIGVESH RATHI SUSPENDED. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2025
- Digvesh has been fined 50% of his match fees and suspended Vs GT.
- Abhishek Sharma also fined 25%. pic.twitter.com/cmmxnLqHk7
ఇది IPL 2025లో 2.5వ చాప్టర్ కింద బౌలర్ దిగ్వేశ్ రాఠీ చేసిన మూడవ లెవెల్ 1 నేరం. అతను 2 డెమెరిట్ పాయింట్లు కోల్పోయాడు. ఇంతకు ముందు 3 డెమెరిట్ పాయింట్లు కోల్పోయాడు. 01 ఏప్రిల్, 2025న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక డిమెరిట్ పాయింట్, 04 ఏప్రిల్, 2025న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 డిమెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో ఉన్నాయి.
దిగ్వేశ్ సింగ్‌పై 1 మ్యాచ్ నిషేధం
ఒకే సీజన్‌లో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ ఖాతాలో 5 డిమెరిట్ పాయింట్లు ఉన్నాయి. దాంతో లక్నో స్పిన్నర్ దిగ్వేశ్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. దిగ్వేశ్ రాఠీ లక్నో సూపర్ జెయింట్స్ అడనున్న నెక్ట్స్ మ్యాచ్‌లో అందుబాటులో ఉండడు. LSG తరువాతి మ్యాచ్ మే 22, 2025న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఓ మ్యాచ్ నిషేధం కారణంగా దిగ్వేష్ ఆ మ్యాచ్ ఆడటం కుదరదు.
Kuch log hote hain jinhe bina baat ke Attitude hota hai, ye Digvesh Rathi vahi banda hai pic.twitter.com/1C6uvjlSXY
— Prayag (@theprayagtiwari) May 19, 2025
అభిషేక్ శర్మకు సైతం జరిమానా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మపై కూడా చర్యలు తీసుకున్నారు. IPL నియమావళిని ఉల్లంఘించినందుకు అభిషేక్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఈ సీజన్‌లో 2.6వ చాప్టర్ కింద ఇది అభిషేక్ శర్మకు మొదటి లెవెల్ 1 తప్పిదం. దాంతో అతడి ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ పడింది. లక్నోతో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. మరోవైపు SRH విజయంతో లక్నో ప్లే ఆఫ్ అవకాశాలకు గండి కొట్టింది. దాంతో తాను ఇంటిదారి పడుతూ, అటు పంత్ సారథ్యంలోని లక్నోను సైతం లీగ్ స్టేజీకే పరిమితం చేసింది.





















