GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!
ఐపీఎల్ 2023 మొదటి మ్యాచ్‌లో గుజరాత్, చెన్నైల తుది జట్లు ఎలా ఉండవచ్చు?
Gujarat Titans vs Chennai Super Kings: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన IPL 2023 లీగ్ ప్రారంభానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. మరోవైపు గతేడాది గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించింది. IPL 2023 మొదటి మ్యాచ్‌లో రెండు జట్లకు చెందిన చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండరు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో సాధ్యమయ్యే ప్లేయింగ్ XI ఏంటో చూద్దాం.
ఈ రెండు జట్ల ఆటగాళ్లు గైర్హాజరవుతారు
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లలోని చాలా మంది ముఖ్యమైన ఆటగాళ్లు అందుబాటులో ఉండరు. హార్దిక్ పాండ్యా జట్టు గురించి మాట్లాడితే అతని జట్టులో కీలక బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ అందుబాటులో ఉండడు. డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ కోసం జాతీయ జట్టులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా 2023 ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే, నెదర్లాండ్స్‌తో కనీసం రెండు మ్యాచ్‌లైనా గెలవాలి.
మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడితే, వారి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి మ్యాచ్‌లో ఆడటంపై సందేహం వచ్చింది. వాస్తవానికి శిక్షణ సమయంలో ధోని మోకాలికి గాయమైంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో ధోనీ ఆడతాడని సీఎస్‌కే సీఈవో స్పష్టం చేశారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేష్ తీక్షణ, మతియాస్ పతిరానా లేకుండానే రంగంలోకి దిగనుంది. ఈ ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నారు. ఈ ఆటగాళ్లు ఏప్రిల్ 8వ తేదీ తర్వాత మాత్రమే జట్టులో చేరగలరు.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు (అంచనా)
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శివమ్ మావి, జయంత్ యాదవ్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు (అంచనా)
మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్/వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే
చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్
వికెట్ కీపర్లు: మహేంద్ర సింగ్ ధోని, డెవాన్ కాన్వే (న్యూజిలాండ్).
బ్యాటర్లు: రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, అజింక్యా రహానే.
ఆల్ రౌండర్లు: మొయిన్ అలీ (ఇంగ్లండ్), శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్ (SA), మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), కైల్ జామీసన్ (న్యూజిలాండ్), అజయ్ మండల్, భగత్ వర్మ, నిశాంత్ సింధు.
బౌలర్లు: దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ (శ్రీలంక), సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ (శ్రీలంక)