CSK IPL 2023 Schedule: ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ - మొదటి మ్యాచ్ ఎవరితో?
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి షెడ్యూలు ఇదే.
CSK IPL 2023 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. IPL 2023లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి లీగ్ రౌండ్‌లో మొత్తం 10 జట్లు తలో 14 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ విధంగా లీగ్ రౌండ్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు, ఆ తర్వాత ప్లే ఆఫ్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది.
మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 31వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సీజన్‌లో తమ రెండో మ్యాచ్‌లో ఏప్రిల్ 3వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ ముందు తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లోని మూడో మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ జట్టు రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్
31 మార్చి 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v గుజరాత్ టైటాన్స్ - నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
2 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v లక్నో సూపర్ జెయింట్స్ - చెపాక్ స్టేడియం, చెన్నై
8 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ముంబై ఇండియన్స్, వాంఖడే స్టేడియం, ముంబై
12 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v రాజస్థాన్ రాయల్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
17 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
21 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v సన్‌రైజర్స్ హైదరాబాద్, చెపాక్ స్టేడియం, చెన్నై
23 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v కోల్కతా నైట్ రైడర్స్, ఈడెన్ గార్డెన్ స్టేడియం, కోల్‌కతా
27 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v రాజస్థాన్ రాయల్స్, జైపూర్
30 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ కింగ్స్ v పంజాబ్ కింగ్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
4 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v లక్నో సూపర్ జెయింట్స్, ఎకానా స్టేడియం, లక్నో
6 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ముంబై ఇండియన్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
10 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ఢిల్లీ క్యాపిటల్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
1 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v కోల్కతా నైట్ రైడర్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
20 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్
వికెట్ కీపర్లు: మహేంద్ర సింగ్ ధోని, డెవాన్ కాన్వే (న్యూజిలాండ్).
బ్యాటర్లు: రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, అజింక్యా రహానే.
ఆల్ రౌండర్లు: మొయిన్ అలీ (ఇంగ్లండ్), శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్ (SA), మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), కైల్ జామీసన్ (న్యూజిలాండ్), అజయ్ మండల్, భగత్ వర్మ, నిశాంత్ సింధు.
బౌలర్లు: దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ (శ్రీలంక), సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ (శ్రీలంక)