News
News
వీడియోలు ఆటలు
X

IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు ముఖేష్ చౌదరి దూరం - మరి చెన్నై ఎవర్ని సెలెక్ట్ చేసింది?

ఐపీఎల్ 2023లో ముఖేష్ చౌదరి స్థానంలో ఆకాష్ సింగ్‌ను చేర్చుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది.

FOLLOW US: 
Share:

Indian Premier League 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా మొత్తం సీజన్‌కు ముఖేష్ చౌదరి దూరం అయ్యారు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులో ముఖేష్ చౌదరి స్థానంలో 20 ఏళ్ల లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ సింగ్‌ను చేర్చుకున్నట్లు ప్రకటించింది.

ఆకాష్ సింగ్ గురించి చెప్పాలంటే అతను 2020 సంవత్సరంలో ఆడిన అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టులో భాగమయ్యాడు. ఇది కాకుండా ముఖేష్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా ఆడాడు. ఆకాష్ సింగ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌తో జట్టులో చేర్చుకుంది.

ఇప్పటి వరకు ఆకాష్ సింగ్ కెరీర్ ను పరిశీలిస్తే ఈ యువ ఆటగాడు ఇప్పటి వరకు తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడగా అందులో 34.85 సగటుతో ఏడు వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో ముఖేష్ నాగాలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందులో అతను ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.

గత సీజన్‌లో దీపక్ చాహర్ లేకపోవడంతో ముఖేష్ చౌదరి చెన్నై సూపర్ కింగ్స్ పేస్ అటాక్‌కు నాయకత్వం వహించాడు. ముఖేష్ గత సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడాడు. 26.5 సగటుతో మొత్తం 16 వికెట్లు తీసుకున్నాడు. అందులో అతను ఒక మ్యాచ్‌లో 46 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు.  దీనికి ముందు కైల్ జేమీసన్ రూపంలో ఇప్పటికే జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

చెన్నై బ్యాటర్లలో రాయుడంటే ఎంఎస్ ధోనీకి ఎందుకో చెప్పలేని అభిమానం! అతడి ఆటతీరు, బ్యాటింగ్ శైలిని ఇష్టపడతాడు. తన కెప్టెన్సీలో టీమ్‌ఇండియాకూ ఆడించాడు. మ్యాచ్‌ పరిస్థితులను బట్టి టాప్‌ నుంచి లోయర్‌ ఆర్డర్‌ వరకు అతడు ఇన్నింగ్స్‌ను తీసుకెళ్లగలడని నమ్మకం. అందుకే 2018లో అతడిని సీఎస్‌కేలోకి తీసుకున్నాడు. రావడం రావడంతోనే పూనకాలు లోడింగ్‌ అన్నట్టుగా చెలరేగాడు రాయుడు. 16 ఇన్నింగ్సుల్లో 43 సగటు, 150 స్ట్రైక్‌రేట్‌తో 602 రన్స్‌ చేశాడు. లీగు సాగే కొద్దీ విధ్వంసపు రేటును మరింత పెంచాడు. సన్‌రైజర్స్‌పై 62 బంతుల్లో అజేయ సెంచరీ బాదేశాడు. సీఎస్‌కేకు ట్రోఫీ అందించాడు. 2020లో 359 రన్స్‌ చేశాడు. మిగతా మూడు సీజన్లలో 250+ స్కోర్లు సాధించాడు. గతేడాది సీఎస్‌కే పేలవ ప్రదర్శన తర్వాత ఇదే చివరి సీజన్‌ అని ప్రకటించాడు. మళ్లీ యాజమాన్యం మాట్లాడటంతో యూటర్న్‌ తీసుకున్నాడు. ఈ సీజన్లో అతడిపై ధోనీసేన భారీ ఆశలే పెట్టుకొంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ప్రతి సీజన్లోనూ అద్భుతంగా ఆడాడు రాయుడు. ఇప్పటి వరకు 188 మ్యాచులాడి 4190 పరుగులు చేశాడు. 29 సగటు, 127 స్ట్రైక్‌రేట్‌తో చితకబాదాడు. 22 హాఫ్‌ సెంచరీలు, ఒక సెంచరీ, 349 బౌండరీలు, 164 సిక్సర్లు దంచికొట్టాడు. కీపింగ్‌లోనూ అదరగొట్టగలడు. మైదానంలో వేగంగా పరుగెత్తుతూ క్యాచులు అందుకోగలడు. 2010 నుంచి 2016 వరకు ఐదుసార్లు 350+ స్కోర్లు సాధించాడు. రెండు సార్లు 250+తో నిలిచాడు. ముంబయి చేసిన మొత్తం స్కోర్లలో అతడి పర్సెంటేజీ సగటున 15 శాతం వరకు ఉంటుంది. 2017లో అతడి ఫామ్‌ డిప్‌ అయింది. కేవలం 5 మ్యాచులాడి 91 పరుగులే చేశాడు.

Published at : 30 Mar 2023 10:51 PM (IST) Tags: Chennai Super Kings Indian Premier League 2023 Akash Singh Mukesh Choudhary

సంబంధిత కథనాలు

Team India Tour Of West Indies: టీమిండియా విండీస్ టూర్‌కు షెడ్యూల్ ఖరారు! - అమెరికాలోనూ మ్యాచ్‌లు

Team India Tour Of West Indies: టీమిండియా విండీస్ టూర్‌కు షెడ్యూల్ ఖరారు! - అమెరికాలోనూ మ్యాచ్‌లు

Ashes 2023: గాయంతో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఔట్ - రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడిని ఒప్పిస్తున్న హెడ్‌కోచ్

Ashes 2023: గాయంతో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఔట్ - రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడిని ఒప్పిస్తున్న హెడ్‌కోచ్

Kohli Test Records: రికార్డుల వేటలో రన్ మిషీన్ - కోహ్లీని ఊరిస్తున్న మైల్ స్టోన్స్

Kohli Test Records: రికార్డుల వేటలో రన్ మిషీన్ - కోహ్లీని ఊరిస్తున్న మైల్ స్టోన్స్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: మాకా.. నాకౌట్‌ ప్రెజరా! ఐసీసీ ట్రోఫీపై ద్రవిడ్‌ రెస్పాన్స్‌ ఇదీ!

WTC Final 2023: మాకా.. నాకౌట్‌ ప్రెజరా! ఐసీసీ ట్రోఫీపై ద్రవిడ్‌ రెస్పాన్స్‌ ఇదీ!

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!