IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

IPL 2022, LSG vs DC Preview: డేవిడ్‌ భాయ్‌ ఆగయా! ఫ్యూచర్‌ కెప్టెన్లు రాహుల్‌, పంత్‌ ఫైటింగ్‌!

IPL 2022, LSG vs DC Preview: ఐపీఎల్‌ 2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Supergiants), దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తలపడుతున్నాయి. భవిష్యత్తు భారత సారథులుగా భావిస్తున్న కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)లో గెలుపెవరిది?

FOLLOW US: 

IPL 2022, LSG vs DC Preview: ఐపీఎల్‌ 2022లో ఓ అద్భుతమైన మ్యాచ్‌కు వేళైంది! డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగే 15వ మ్యాచులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Supergiants), దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తలపడుతున్నాయి. రెండు జట్లలోనూ బ్యాటింగ్‌, బౌలింగ్‌ డెప్త్ బాగుంది. మరి భవిష్యత్తు భారత సారథులుగా భావిస్తున్న కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)లో గెలుపెవరిది? ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎవరెవరు ఉంటారు? ఏ ఆటగాడిపై ఎవరిది పై చేయి?

* దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, లక్నో సారథి కేఎల్ రాహుల్‌ బ్యాటింగ్‌ అంటే ఇష్టపడని వారుండరు. ఎందుకంటే బ్యాటింగ్‌ ఇంత ఈజీగా ఉంటుందా అన్నట్టు వారి షాట్లు ఉంటాయి. అందుకే ఈ మ్యాచ్‌పై ఆసక్తి ఎక్కువగా ఉంది.

* ఈ మ్యాచుకు ముందు లక్నో (LSG) మూడింట్లో రెండు గెలిచింది. సూపర్‌ జోష్‌లో ఉంది. దిల్లీ (DC) రెండు ఆడితే ఒకటి గెలిచి మరొకటి ఓడింది.

* డీవై పాటిల్‌లో (DY Patil Stadium) తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 170+గా ఉంది. టాస్‌ కీలకమే అయినా టార్గెట్లను డిఫెండ్‌ చేసుకోవడం సాధ్యమవుతోంది. కాబట్టి డ్యూతో సంబంధం లేకుండా పోటీ ఉండొచ్చు.

* దిల్లీతో పోలిస్తే లక్నో డెత్‌ బౌలింగ్‌ కాస్త వీక్‌గా ఉంది. అవేశ్‌ ఖాన్ (Avesh khan) ఒక్కడిపైనే ఆధార పడాల్సి వస్తోంది. విదేశీ పేసర్లు మరింత మెరుగ్గా వేస్తే బెటర్‌.

* ఈ మ్యాచుకు డేవిడ్‌ వార్నర్‌ (David Warner), ఆన్రిచ్‌ నార్జ్‌ (Anrich Nortje) అందుబాటులో ఉంటారు. వారి క్వారంటైన్‌ పూర్తైంది. వీరిద్దరి రాకతో దిల్లీ మరింత భయంకరంగా మారుతుంది. పృథ్వీ షా (Prithvi Shaw)కు బెటర్‌ ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌గా డేవిడ్‌ భాయ్‌ ఉంటాడు. గాయం నుంచి కోలుకున్న నార్జ్‌ ఎలా బౌలింగ్‌ చేస్తాడో చూడాలి.

* ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ (Marcus Stoinis) రావడంతో లక్నో డెప్త్‌ మరింత పెరిగింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో అతడు ఉపయోగపడతాడు. ఇప్పటికే భీకరంగా ఉన్న మిడిలార్డర్‌కు ఇప్పుడు అతడి రూపంలో మరో ఫినిషర్‌ దొరికాడు.

* డేవిడ్‌ వార్నర్‌పై రవి బిష్ణోయ్‌ (Ravi Bishnoi) రికార్డు బాగుంది. నాలుగు బంతుల్లో ఐదు పరుగులు ఇచ్చి రెండుసార్లు ఔట్‌ చేశాడు. ఇక దిల్లీ క్యాపిటల్స్‌ స్లో బంతులతో బోల్తా కొట్టించే అక్షర్‌ (Axar Patel)ను కేఎల్‌ రాహుల్‌పై ప్రయోగించొచ్చు. అతడు 13 బంతులేసి 14 పరుగులిచ్చి 3 సార్లు ఔట్‌ చేశాడు. రిషభ్‌ పంత్‌, రవి బిష్ణోయ్‌ ఫైటింగ్‌ బాగుంటుంది.

LSG vs DC Probable playing XI

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG Playing XI): కేఎల్‌ రాహుల్‌, క్వింటన్‌ డికాక్‌, ఎవిన్‌ లూయిస్‌, మార్కస్‌ స్టాయినిస్‌, దీపక్‌ హుడా, ఆయుష్‌ బదోనీ, కృనాల్‌ పాండ్య, జేసన్‌ హోల్డర్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌

దిల్లీ క్యాపిటల్స్‌ (DC Playing XI): డేవిడ్‌ వార్నర్‌, పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌ / యశ్‌ ధుల్‌ / మన్‌దీప్‌ సింగ్‌, రిషభ్‌ పంత్‌, లలిత్‌ యాదవ్‌, రోమన్‌ పావెల్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆన్రిచ్‌ నార్జ్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌

Published at : 07 Apr 2022 03:33 PM (IST) Tags: IPL IPL 2022 Indian Premier League IPL 2022 Schedule IPL 2022 news ipl season 15 IPL 2022 Live lsg vs dc

సంబంధిత కథనాలు

KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్‌ వెళ్తారా? ఓడి టెన్షన్‌ పడతారా!

KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్‌ వెళ్తారా? ఓడి టెన్షన్‌ పడతారా!

MI vs SRH, Match Highlights: రమణను నమ్మని డేవిడ్‌ - సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆ రనౌట్‌!

MI vs SRH, Match Highlights: రమణను నమ్మని డేవిడ్‌ - సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆ రనౌట్‌!

MI vs SRH, 1 Innings Highlights: ఫైనల్‌ ఆడినట్టుగా చితక్కొట్టిన సన్‌రైజర్స్‌ - ముంబయికి భారీ టార్గెట్‌!

MI vs SRH, 1 Innings Highlights: ఫైనల్‌ ఆడినట్టుగా చితక్కొట్టిన సన్‌రైజర్స్‌ - ముంబయికి భారీ టార్గెట్‌!

MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్‌ వైపే! టాస్‌ ఓడిన కేన్‌ మామ!

MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్‌ వైపే! టాస్‌ ఓడిన కేన్‌ మామ!

Tilak Varma: ట్విటర్లో తిలక్‌ వర్మ ట్రెండింగ్‌- సన్నీ గావస్కర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Tilak Varma: ట్విటర్లో తిలక్‌ వర్మ ట్రెండింగ్‌- సన్నీ గావస్కర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !

Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !

Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు

Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు

YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ

YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ

Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు