అన్వేషించండి

DC vs SRH Live Updates: ఎనిమిది వికెట్లతో ఢిల్లీ విజయం.. సన్‌రైజర్స్ దాదాపు ఇంటికే..

IPL 2021, Match 31, DC vs SRH: నేటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది.

LIVE

Key Events
DC vs SRH Live Updates: ఎనిమిది వికెట్లతో ఢిల్లీ విజయం.. సన్‌రైజర్స్ దాదాపు ఇంటికే..

Background

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. వీటిలో ఢిల్లీ ఆరు విజయాలు సాధించి దుమ్మురేపుతోన్న జట్టు కాగా,ఆరు అపజయాలతో ఆఖర్లో నిలబడిన జట్టు సన్‌రైజర్స్. ఈ మ్యాచ్ విజయం సాధించి ప్లేఆఫ్స్‌‌కు మరింత దగ్గర కావాలనేది పంత్ సేన పంతం కాగా, నిలవాలంటే ప్రతి గెలవాల్సిందేనన్న పట్టుదల కేన్ విలియమ్సన్ బృందానిది.

గత రెండేళ్లుగా తిరుగులేని ఆటతీరుతో సాగుతోంది ఢిల్లీ. ఈసారి ఎలాగైనా తొలి టైటిల్‌ అందుకోవాలని పట్టుదలతో ఉంది. తొలి దశ ముగిసే సమయానికి 8 మ్యాచుల్లో 6 గెలిచింది. మరోవైపు 2016 విజేతైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. తొలి దశలో ఏడు మ్యాచులాడి ఆరు ఓడి 2 పాయింట్లతో అట్టడుగున నిలిచింది.

అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఢిల్లీపై సన్‌రైజర్స్‌దే పైచేయి. ఈ రెండు జట్లు 19 సార్లు తలపడగా 11 సార్లు హైదరాబాదే గెలిచింది. ఢిల్లీ ఏడుసార్లు మాత్రమే విజయం అందుకుంది. అయితే చివరి ఐదు మ్యాచుల్లో మాత్రం ఢిల్లీ కాస్త మెరుగైంది. మూడింట్లో గెలిచింది. ప్రస్తుతం ఏ రకంగా చూసిన దిల్లీయే పటిష్ఠంగా కనిపిస్తోంది. సీజన్‌ మొదటి దశలో పవర్‌ప్లేలో ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా రెచ్చిపోయారు. రెండేళ్ల నుంచి పంత్‌ స్ట్రైక్‌రేట్‌ తగ్గినా పరిణతి కనిపిస్తోంది. స్టాయినిస్‌, స్మిత్‌, హెట్‌మైయిర్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ వరకు బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉంది. ఇక అవేశ్‌ ఖాన్‌, ఆన్రిచ్‌ నార్జ్‌, రబాడా, అశ్విన్‌, అక్షర్‌, స్టాయినిస్‌ బౌలింగ్‌కు తిరుగులేదు. 

సీజన్‌ ఆరంభంతో పోలిస్తే సన్‌రైజర్స్‌ మరింత పేలవంగా మారడం బాధాకరం. ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో దుబాయ్‌కి రాలేదు. మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తొలగించిన డేవిడ్‌ వార్నర్‌ ఎంత వరకు ఆడతాడో చెప్పలేని పరిస్థితి. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పైనే సన్‌రైజర్స్ ఆశలన్నీ పెట్టుకుంది. మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే, అబ్దుల్‌ సమద్‌, కేదార్‌ జాదవ్‌ ఉన్నారు. పేపర్‌పై పేర్లు కనిపిస్తున్నా.. నమ్మకం తక్కువే. టి.నటరాజన్‌ కరోనాతో మ్యాచ్‌కు దూరం అయ్యాడు.

22:59 PM (IST)  •  22 Sep 2021

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 17.5 ఓవర్లలో ముగిసేసరికి ఢిల్లీ 139-2.. ఎనిమిది వికెట్లతో విజయం

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్ ఐదు బంతుల్లో 13 పరుగులు చేసి ఢిల్లీ ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది.

శ్రేయాస్ అయ్యర్ 47(41)
రిషబ్ పంత్ 35(21)
జేసన్ హోల్డర్ 3.5-0-33-0

22:53 PM (IST)  •  22 Sep 2021

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 126-2

ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 126-2గా ఉంది. గెలవాలంటే 18 బంతుల్లో 9 పరుగులు చేయాలి.

శ్రేయాస్ అయ్యర్ 40(38)
రిషబ్ పంత్ 30(19)
ఖలీల్ అహ్మద్ 4-0-21-0

22:46 PM (IST)  •  22 Sep 2021

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 110-2

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 110-2గా ఉంది. గెలవాలంటే 24 బంతుల్లో 25 పరుగులు చేయాలి.

శ్రేయాస్ అయ్యర్ 39(37)
రిషబ్ పంత్ 17(14)
భువనేశ్వర్ 3-0-21-0

22:41 PM (IST)  •  22 Sep 2021

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 99-2

రషీద్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 99-2గా ఉంది. గెలవాలంటే 30 బంతుల్లో 36 పరుగులు చేయాలి.

శ్రేయాస్ అయ్యర్ 37(35)
రిషబ్ పంత్ 8(10)
రషీద్ ఖాన్ 4-0-26-1

22:35 PM (IST)  •  22 Sep 2021

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 96-2

సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 96-2గా ఉంది. గెలవాలంటే 36 బంతుల్లో 39 పరుగులు చేయాలి.

శ్రేయాస్ అయ్యర్ 36(32)
రిషబ్ పంత్ 7(7)
సందీప్ శర్మ 3-0-26-1

22:30 PM (IST)  •  22 Sep 2021

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 85-2

ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 85-2గా ఉంది. గెలవాలంటే 42 బంతుల్లో 50 పరుగులు చేయాలి.

శ్రేయాస్ అయ్యర్ 25(26)
రిషబ్ పంత్ 7(7)
ఖలీల్ అహ్మద్ 3-0-17-1

22:26 PM (IST)  •  22 Sep 2021

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 80-2

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు మాత్రమే వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 80-2గా ఉంది. గెలవాలంటే 48 బంతుల్లో 55 పరుగులు చేయాలి.

శ్రేయాస్ అయ్యర్ 22(23)
రిషబ్ పంత్ 5(4)
జేసన్ హోల్డర్ 3-0-20-0

22:21 PM (IST)  •  22 Sep 2021

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 73-2

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. శిఖర్ ధావన్ అవుటయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 73-2గా ఉంది. గెలవాలంటే 54 బంతుల్లో 62 పరుగులు చేయాలి.

శ్రేయాస్ అయ్యర్ 17(18)
రిషబ్ పంత్ 0(0)
రషీద్ ఖాన్ 3-0-23-1

22:20 PM (IST)  •  22 Sep 2021

శిఖర్ ధావన్ అవుట్

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి సమద్ చేతికి శిఖర్ ధావన్ చిక్కాడు.
శిఖర్ ధావన్ (సి)అబ్దుల్ సమద్ (బి) రషీద్ ఖాన్ (42: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)

22:16 PM (IST)  •  22 Sep 2021

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్: 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 69-1

సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 69-1గా ఉంది. గెలవాలంటే 60 బంతుల్లో 66 పరుగులు చేయాలి.

శ్రేయాస్ అయ్యర్ 17(18)
శిఖర్ ధావన్ 41(34)
సందీప్ శర్మ 2-0-15-0

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pinkvilla Screen And Style Awards: ముంబయిలో ఘనంగా జరిగిన అవార్డుల వేడుక, విభిన్న డ్రెస్సుల్లో తారలుRajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్నShraddha Kapoor Pizza Paparazzi: పింక్ విల్లా స్క్రీన్ అండ్ స్టయిల్ అవార్డుల్లో ఆసక్తికర ఘటనAnupama Parameswaran Tillu Square Song Launch: అనుపమ మాట్లాడుతుంటే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Home Loan: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Embed widget