IPL 2021, DC vs RR: ఢిల్లీతో ఢీ.. సై అంటున్న రాజస్తాన్!
IPL 2021, Delhi Capitals vs Rajasthan Royals: ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి.
ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్‌లో యూఏఈలో మధ్యాహ్నం జరగనున్న మొదటి మధ్యాహ్నం మ్యాచ్ ఇదే. ఢిల్లీ, ముంబై రెండు జట్లు గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీదున్నాయి. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ను 12 బంతుల్లో 8 పరుగులు చేయనివ్వకుండా కట్టడి చేసి రాజస్తాన్ విజయం సాధించింది. దీంతో రాజస్తాన్ మరింత ఆత్మవిశ్వాసంతో ఉంది.
ఢిల్లీని దెబ్బకట్టడం కష్టమే..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గత మ్యాచ్‌లో చిత్తుగా ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఊపు మీద ఉంది. ఆన్రిచ్ నోర్జే, కగిసో రబడలు బంతితో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నారు. మార్కస్ స్టాయినిస్ గాయం నుంచి కోలుకుని తిరిగొస్తాడో లేదో చూడాలి. ఢిల్లీలో పృథ్వీ షా, ధావన్, శ్రేయస్ అయ్యర్, పంత్, స్టాయినిస్, హెట్‌మేయర్ ఇలా అందరూ ఫాంలో ఉన్నారు.
Also Read: యువీ.. గౌతీ తోడుగా ధోనీసేన అద్భుతం చేయగా! టీ20 ప్రపంచకప్ గెలిచి 13 ఏళ్లు
రాజస్తాన్ ఆత్మవిశ్వాసంతో..
గత మ్యాచ్‌లో పంజాబ్‌పై అద్భుత విజయం సాధించి రాజస్తాన్ కూడా పోటీకి ఢీ అంటోంది. రాజస్తాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్‌లో కొన్ని లోపాలున్నా విజయాలు సాధించే జట్టు కూర్పును మార్చే అవకాశం అయితే లేదు. ఇక రాజస్తాన్‌లో ఆకట్టుకుంటున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఎవిన్ లూయిస్, సంజు శామ్సన్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి బ్యాట్స్‌మన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి వంటి బౌలర్లు ఉన్నారు.
ఐపీఎల్‌లో ఈ రెండు జట్లూ 23 సార్లు తలపడగా.. రాజస్తాన్ రాయల్స్ 12 సార్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 11 సార్లు గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో గెలిచి రాజస్తాన్ ఆధిపత్యం పెంచుకుంటుందా.. ఢిల్లీ గెలిచి రికార్డు సమం చేస్తుందా తెలుసుకోవాలంటే మ్యాచ్ అయ్యే దాకా వెయిట్ చేయాల్సిందే!
తుది జట్లు(అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), స్టాయినిస్/కరన్, షిమ్రన్ హెట్‌మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, ఆన్రిచ్ నోర్జే, అవేష్ ఖాన్
రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైశ్వాల్, ఎవిన్ లూయిస్, సంజు శామ్సన్(కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్ స్టోన్, మహిపాల్ లోమ్‌రోర్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి
Also Read: అర్థం లేకుండా కోహ్లీ ఆట.. చెన్నైపై ఓడితే కెప్టెన్సీ నుంచి తీసేయనున్న ఆర్‌సీబీ!
Also Read: నటరాజన్ స్థానంలో మరొకరిని తీసుకున్న సన్‌రైజర్స్.. ఎవరో తెలుసా?