IPL 2021: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో బాహుబలికి ఇష్టమైన సందర్భం ఇదే! అభిమానులను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్న వార్నర్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో తనకిష్టమైన మూమెంట్‌ను డేవిడ్‌ వార్నర్‌ పంచుకున్నాడు. ఆటగాళ్లతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. తనను ప్రేమించిన, జట్టుకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు.

FOLLOW US: 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు-2021లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోరు ముగిసింది. ఈ సీజన్లో 14 మ్యాచులు ఆడిన ఆ జట్టు కేవలం 3 విజయాలే  సాధించింది. గతంలో ఎన్నడూ లేనంత ఘోరమైన ప్రదర్శన చేయడంతో అభిమానులు నిరాశచెందారు. దానికితోడు జట్టుకు ఆడటం ఇదే చివరి సారని చెప్పడంతో వారంత బాధపడ్డారు.

సన్‌రైజర్స్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించిన వెంటనే భావోద్వేగంతో నిండిన సందేశం పెట్టాడు. హైదరాబాద్‌ జట్టుతో తన అనుబంధం గుర్తు చేసుకున్నాడు. ఫ్రాంచైజీలోని ఆటగాళ్లతో తనకు అనుభూతులెన్నో ఉన్నాయని తెలిపాడు. జట్టుతో తన మధుర స్మృతులను నెమరువేసుకున్నాడు. అంతేకాకుండా ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

'నాకిష్టమైన సందర్భం!! దాంతోపాటు మా ప్రయాణంలోని కొన్ని చిత్రాలివి. మాకు ఎల్లప్పుడూ అండగా నిలబడినందుకు ఆ చివరి చిత్రం ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నా' అని డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాలో కొన్ని చిత్రాలను పోస్ట్‌ చేశాడు.

హైదరాబాద్‌ తరఫున వార్నర్‌కు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. 2014లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. జట్టుకు 95 మ్యాచుల్లో 4014 పరుగులు చేశాడు. 2015లో నాయకుడిగా ఎంపికైన అతడు ఆ తర్వాత దుమ్మురేపాడు. 2016లో వీరోచితమైన ఫామ్‌, బ్యాటింగ్‌, నాయకత్వంతో ఐపీఎల్‌ టైటిల్‌ అందించాడు. అభిమానుల దృష్టిలో బాహుబలిగా నిలిచిపోయాడు.

View this post on Instagram
 
A post shared by David Warner (@davidwarner31)

Also Read: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం

Also Read: డేవిడ్‌ వార్నర్‌ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్‌ మంజ్రేకర్‌ అనుమానం!

Also Read: ఆఖరి బంతికి సిక్స్‌..! ఆ కిక్కులో ఆర్‌సీబీ చేసుకున్న సంబరాలు చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Oct 2021 06:26 PM (IST) Tags: IPL 2021 SRH Sunrisers Hyderabad David Warner favourite moments

సంబంధిత కథనాలు

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?

RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్