Greatest Indian Test Batsman: 50 ఏళ్లలో భారత బెస్ట్ టెస్టు బ్యాటర్ సచిన్ కాదట! విజ్డెన్ పోల్‌లో ఫలితం ఏంటంటే?
గత 50 ఏళ్లలో భారత అత్యుత్తమ టెస్టు బ్యాటర్ ఎవరని విజ్డెన్ ఇండియా అభిమానులను ప్రశ్నించింది. దిగ్గజాలతో పోటీ పెట్టగా సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ విపరీతంగా పోటీపడ్డారు.
Greatest Indian Test Batsman, Sachin Tendulkar vs Rahul Dravid: గత 50 ఏళ్లలో భారత అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ ఎవరు? అంటే సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సునిల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గుండప్ప విశ్వనాథ్, విరాట్ కోహ్లీ వంటి పేర్లు వినిపిస్తాయి. ఎందుకంటే వీరంతా గొప్ప ఆటగాళ్లే. సుదీర్ఘ ఫార్మాట్లో దేశానికి అద్భుతమైన సేవలు అందించారు. అయితే వీరిలో ఎవరో ఒకరినే ఎంచుకోవాలంటే మాత్రం అంత సులభం కాదు.
విజ్డెన్ ఇండియా అభిమానులకు ఈ తరహాలో పోల్‌నే నిర్వహించింది. గత 50 ఏళ్లలో భారత అత్యుత్తమ టెస్టు బ్యాటర్ ఎవరని అభిమానులను ప్రశ్నించింది. సచిన్, విశ్వనాథ్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సునిల్ గావస్కర్, చెతేశ్వర్ పుజారాను ఇందుకు ఎంపిక చేసింది. అభిమానుల ఓట్లు వేయగా... ఆఖరికి సచిన్, ద్రవిడ్ విపరీతంగా పోటీపడ్డారు. చాలా రోజుల వరకు ఈ ఇద్దరు దిగ్గజాల ఓటింగ్ శాతం 49, 51 మధ్యే సాగింది. ఫలితం వెల్లడించేందుకు ఈ రోజు సాయంత్రమే చివరి గడువు.
Ladies and gentlemen,
— Wisden India (@WisdenIndia) June 23, 2020
The winner, and India's greatest Test batsman ...
RAHUL DRAVID 🔥
What a tight race that was!
Finally vote count 👉 https://t.co/0o2S6lt6Fz pic.twitter.com/9TIV6LEIIS
ఈ పోటీలో సచిన్ త్రుటిలో స్వల్ప తేడాతో వెనకబడ్డారు. దాంతో ఈ అర్ధశతాబ్దపు భారత అత్యుత్తమ టెస్టు బ్యాటర్‌గా ద్రవిడ్‌ను విజ్డెన్ ప్రకటించింది. పోటీలో మిస్టర్ డిపెండబుల్ గెలిచినప్పటికీ సచిన్ తక్కువ కాదని వెల్లడించింది. వీరిద్దరూ దిగ్గజాలేనని పేర్కొంది.
'మీరంతా ఓటింగ్ చేసినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చాలా కష్టమైన పోటీలోకి ఆహ్వానించామని తెలుసు. ఇంత మందిలో అత్యుత్తమ బ్యాటర్‌ను ఎంపిక చేయడం సవాలే. ఆటలోని హీరోలను మేమెంతో ఇష్టపడతాం. గౌరవిస్తాం. పోల్ ఎలా ముగిసినప్పటికీ సచిన్, ద్రవిడ్ ఇద్దరూ ఆల్‌టైం గ్రేటే. వారిద్దరి బ్యాటింగ్‌ను చూసే అదృష్టం మనకు దక్కింది' అని విజ్డెన్ ఫేస్‌బుక్‌లో పేర్కొంది.
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
Also Read: IND vs SA 2nd Test: వాండరర్స్‌లో 'వండర్'కు సిద్ధమైన కోహ్లీ.. 7 పరుగులు చేస్తే ఆ రికార్డు బద్దలే!
Also Read: Team India Schedule 2022: ఏడాదంతా క్రికెట్ పండగే! టీమ్‌ఇండియాకు వరుసగా కీలక సిరీసులు.. ప్రపంచకప్
Also Read: Jasprit Bumrah: పేస్ బౌలర్లకు బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు.. అవసరమైతే బుమ్రాకు కెప్టెన్సీ