Shubman Gill Instagram Post: సారా తెందూల్కర్‌తో గిల్‌కు బ్రేకప్ అయిందా? డౌట్లు రేకెత్తించిన గిల్ పోస్టు
క్రికెటర్ శుభ్‌మన్ గిల్, సారా తెందూల్కర్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని చాలామంది అనుమానం. అతడు ఇన్‌స్టాలో పెట్టిన ఓ సందేశం సారాతో బ్రేకప్ అయిందా అని అనుమానాలు రేకెత్తిస్తోంది.

టీమ్‌ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ అందరిలోనూ ఓ సందేహం రేకెత్తించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ కుమార్తె సారా తెందూల్కర్‌తో బ్రేకప్ అయిందేమో అనుకునేట్టుగా చేశాడు. ఇన్‌స్టా గ్రామ్‌లో అతడు పెట్టిన పోస్టే ఇందుకు కారణం.
శుభ్‌మన్ గిల్‌ను సచిన్ కుమార్తె సారా తెందూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంది. అతడు పెట్టే పోస్టులకు లైకులు కొడుతుంది. అంతేకాకుండా వీరిద్దరూ ఒకేసారి ఒకే తరహా సందేశాలను ఇన్‌స్టాలో పెట్టి ఆశ్చర్య పరుస్తుంటారు. వారి పోస్టులు సైతం అలాగే ఉంటాయి. దాంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారేమోనన్న వందంతులు పుట్టాయి.
తాజాగా గిల్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. 'ఏంజెల్స్‌తో ఎప్పుడూ ప్రేమలో పడొద్దు.. సిగ్మా రూల్ నంబర్ వన్' అని గిల్ పోస్టు చేశాడు. వెంటనే అతడిని అభిమానులు కవ్వించడం మొదలు పెట్టేశారు. సారాతో బ్రేకప్ అయిందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం గిల్ ఇంటివద్దే ఉంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి అదిరే ఆరంభాలు ఇచ్చాడు. దాంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సారి ఫైనల్ చేరుకుంది. ప్రపంచకప్‌నకు ఎంపికవ్వకపోవడంతో లీగ్ ముగిశాక అతడు స్వదేశానికి చేరుకున్నాడు.
View this post on Instagram
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
View this post on Instagram





















