అన్వేషించండి

Ind Vs SL, Match Highlights: భారీ లక్ష్యాన్ని ఊదేశారు - రాణించిన అయ్యర్, జడ్డూ, శామ్సన్ - సిరీస్ కూడా మనదే!

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపు సాధించింది.

Ind VS SL 2nd T20I: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 17.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్‌ను కూడా 2-0తో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (74 నాటౌట్: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. రవీంద్ర జడేజా (45 నాటౌట్: 18 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), సంజు శామ్సన్ (39: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించారు.

శ్రేయస్, జడేజా, శామ్సన్ వీరంగం
184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (1: 2 బంతుల్లో) మొదటి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లో ఇషాన్ కిషన్ (16: 15 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుట్ కావడంతో టీమిండియా 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అనంతరం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), సంజు శామ్సన్ (Sanju Samson) టీమిండియాను ఆదుకున్నారు. వీరిద్దరూ కేవలం 47 బంతుల్లో 84 పరుగులు జోడించారు. లహిరు కుమార వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టిన శామ్సన్ అదే ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు.

ఆ తర్వాత అయ్యర్‌కు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) జతకలిశాడు. జడ్డూ వచ్చిన మొదటి బంతి నుంచి భారీ హిట్టింగ్ చేశాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా వేగంగా ఆటడంతో టీమిండియా 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 4.1 ఓవర్లలోనే 58 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో లహిరు కుమారకు రెండు వికెట్లు, చమీరకు ఒక వికెట్ దక్కాయి.

అదరగొట్టిన నిశ్శంక
అంతకు ముందు టాస్ గెలిచిన రోహిత్ శర్మ (Rohit Sharma) బౌలింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు పతుం నిశ్శంక, దనుష్క గుణతిలక (38: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) శ్రీలంకు శుభారంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు కేవలం 8.4 ఓవర్లలోనే 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవ్వరూ రాణించకపోవడంతో శ్రీలంక 102 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

క్రీజులో నిలబడిపోయిన నిశ్శంకకు దసున్ షణక (47 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) జతకలిశాడు. వీరు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొదట్లో కొంచెం నిదానంగా ఆడిన నిశ్శంక ఆ తర్వాత గేర్లు మార్చేశాడు. కేవలం 26 బంతుల్లో వీరిద్దరూ 58 పరుగులు జోడించడం విశేషం. 17వ ఓవర్ నుంచి 19వ ఓవర్ వరకు మూడు ఓవర్లలోనే శ్రీలంక ఏకంగా 49 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 23 పరుగులు రావడంతో శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో శ్రీలంక ఏకంగా 72 పరుగులు బాదేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget