IND vs WI, T20 Predicted 11: విండీస్‌తో తొలి టీ20 - 6వ స్థానానికి ఇద్దరి మధ్య విపరీతమైన పోటీ!
IND vs WI, T20 Predicted 11: టీ20 సిరీసులో వెస్టిండీస్‌ను ఓడించాలని హిట్‌మ్యాన్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు సిరీసు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కరీబియన్లూ కసిగా ఉన్నారు. మరి తొలి మ్యాచులో ఎవరెవరికి చోటు దక్కనుందో!
వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీసుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. అచ్చొచ్చిన ఈడెన్ గార్డెన్‌లోనే మ్యాచులన్నీ ఆడనుంది. వన్డే సిరీసును క్లీన్‌స్వీప్ చేసిన హిట్‌మ్యాన్ సేన పొట్టి సిరీసునూ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సిరీసు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కరీబియన్లూ కసిగా ఉన్నారు. టీ20 ఫార్మాట్లో వారెప్పటికీ ప్రమాదకారులే! మరి తొలి మ్యాచులో టీమ్‌ఇండియాలో ఎవరెవరికి చోటు దక్కే అవకాశం ఉందో చూద్దాం!
Rohit Sharma, Ishan Kishan opening
పిక్క కండరాలు పట్టేయడంతో కేఎల్ రాహుల్ సిరీసుకు దూరమయ్యాడు. అంటే రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయనున్నాడు. మాజీ సారథి విరాట్ కోహ్లీ తనకిష్టమైన మూడో స్థానంలో ఆడతాడు. రిషభ్ పంత్ నాలుగో స్థానం దక్కించుకుంటాడు. టీమ్‌ఇండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు.
Shreyas Iyer / Deepak Hooda in 6th
శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా మధ్య ఆరో స్థానానికి పోటీ ఉంది. మరి రోహిత్, ద్రవిడ్ ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. బంతితోనే కాకుండా బ్యాటుతోనూ రాణించే శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌కు వరుసగా 7, 8 స్థానాలు దక్కొచ్చు. తొమ్మిదో స్థానంలో భువనేశ్వర్ లేదా మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకుంటారు. తుది జట్టులో చోటు కోసం హర్షల్ పటేల్ ఎదురు చూస్తున్నాడు. యుజ్వేంద్ర చాహల్‌తో పాటు కుల్‌దీప్‌కూ చోటు దక్కొచ్చు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మిస్టరీ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను తీసుకున్నా ఆశ్చర్యం లేదు.
Washington Sundar ruled out
నిజానికి వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో చోటు ఖాయం! అలాంటిది అతడు గాయపడటంతో సిరీసుకు దూరమయ్యాడు. త్వరలోనే శ్రీలంక సిరీస్ ఉంది కాబట్టి కేఎల్ రాహుల్ త్వరగా కోలుకోవాల్సి ఉంది. టీమ్‌ఇండియా ఇప్పటికే ఈడెన్ గార్డెన్‌లో సాధన చేసింది. కుర్రాళ్లు జోరు మీదున్నారు.
Probable playing XI of Team India
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ / దీపక్ హుడా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ / మహ్మద్ సిరాజ్ / హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ / రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్
Also Read: భారత్, శ్రీలంక షెడ్యూల్‌లో మార్పులు - యాక్షన్ ఒకరోజు ముందే!
Also Read: విరాట్‌ను ఒంటరిగా వదిలేయండయ్యా సామి - రోహిత్ వేడుకోలు!
Bull's-eye Bhuvi 🎯
— BCCI (@BCCI) February 15, 2022
Sharp Siraj ⚡
A snippet of how the #TeamIndia speedsters sweated it out in the practice session under the watchful eyes of the Bowling Coach Paras Mhambrey at the Eden Gardens. 👌 👌#INDvWI | @Paytm | @BhuviOfficial | @mdsirajofficial pic.twitter.com/hMhCdAY9VJ