IND vs WI 2nd T20: మొన్న సూర్య! నేడు పాండ్యతో ఓపెనింగ్ చేయిస్తారా! విండీస్ ఇక్కడ 49కే ఆలౌట్!
IND vs WI 2nd T20: వెస్టిండీస్‌తో రెండో టీ20కి టీమ్‌ఇండియా రెడీ! మరికొన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టనుంది. కనీసం ఒక్క విజయమైనా అందుకోవాలని విండీస్ పట్టుదలగా ఉంది. మరి నేటి మ్యాచులో విజయం ఎవరిది?
IND vs WI 2nd T20: వెస్టిండీస్‌తో రెండో టీ20కి టీమ్‌ఇండియా రెడీ! తొలి మ్యాచులో కరీబియన్లను చిత్తు చేసిన హిట్‌మ్యాన్ సేన మరో విజయంపై కన్నేసింది. మరికొన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టనుంది. కనీసం ఒక్క విజయమైనా అందుకోవాలని విండీస్ పట్టుదలగా ఉంది. మరి నేటి మ్యాచులో విజయం ఎవరిది? తుది జట్లలో ఎవరుంటారు? పిచ్ ఎలా ఉంది?
ఏడుగురు ఓపెనర్లు
వరుస విజయాలు సాధిస్తున్న టీమ్‌ఇండియా జోరు మీదుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో ఇప్పటికే ఏడుగురితో ఓపెనింగ్ చేయించారు. ఇషాన్ కిషన్, రుతురాజ్, రిషభ్ పంత్‌తో ప్రయోగాలు చేశారు. మొన్నటి మ్యాచులో సూర్య కుమార్‌ను దించారు. బహుశా ఈ మ్యాచులో హార్దిక్ పాండ్యను తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నా షార్ట్ పిచ్ బంతుల వీక్‌నెస్ వెంటాడుతోంది. అతడి స్థానంలో సంజు శాంసన్ లేదా దీపక్ హుడాను ఆడించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. డీకే ఫినిషింగ్ టచ్‌తో అద్భుతాలు చేస్తున్నాడు. స్టేడియం మారడంతో హర్షల్ పటేల్‌కు చోటు దొరకొచ్చు. అర్షదీప్, భువీ, బిష్ణోయ్ బౌలింగ్ బాగుంది.
గెలుపు కోసం!
వరుస ఓటములతో బాధపడుతున్నా టీ20 ఫార్మాట్లో వెస్టిండీస్ ప్రమాదకరమైందే! తమదైన రోజున ప్రత్యర్థులకు చుక్కులు చూపించగలరు! కైల్ మేయర్ ఆల్‌రౌండ్ సామర్థ్యం ఆ జట్టుకు ప్రధాన బలం. అమెరికా వీసా అపాయింటుమెంట్లతో తొలి మ్యాచుకు దూరమైన బ్రాండన్ కింగ్, రొమారియో షెపర్డ్ తుది జట్టులోకి వచ్చేస్తారు. జేసన్ హోల్డర్‌కు టీమ్‌ఇండియాకు అవగాహన ఉంది. కెప్టెన్ నికోలస్ పూరన్, రోమన్ పావెల్, షిమ్రన్ హెట్‌మైయిర్ ఫామ్‌లోకి వస్తే ఆపడం కష్టం. కరీబియన్ల బౌలింగ్ సైతం ఫర్వాలేదు.
లో స్కోరింగ్ పిచ్
రెండో టీ20 వార్నర్ పార్క్‌లో జరుగుతుంది. ఈ స్టేడియంలోనూ స్కోరు తక్కువే నమోదవుతుంది. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. 2019లో విండీస్ ఇక్కడే అత్యల్ప స్కోరు 45కు ఆలౌటైంది. వాతావరణం ప్రశాంతంగానే ఉంటుందని సమాచారం.
IND vs WI 2nd T20 probable XI
భారత్: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్ / హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్
వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, రోమన్ పావెల్, షిమ్రన్ హెట్‌మైయిర్, రొమారియో షెఫర్డ్, అకేల్ హుస్సేన్, కీమోపాల్ / హెడేన్ వాల్ష్ జూనియర్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెకాయ్