By: ABP Desam | Updated at : 05 Jan 2022 04:22 PM (IST)
Edited By: Ramakrishna Paladi
టీమ్ఇండియా
వాండరర్స్ టెస్టులో టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఒడుదొడులకు మధ్య సాగుతోంది! మూడో రోజు లంచ్ విరామానికి 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 161 పరుగుల ఆధిక్యంలో ఉంది. తెలుగు ఆటగాడు హనుమ విహారి (6; 26 బంతుల్లో 1x4), శార్దూల్ ఠాకూర్ (4; 3 బంతుల్లో 1x4) బ్యాటింగ్ చేస్తున్నారు. సీనియర్లు చెతేశ్వర్ పుజారా (53; 86 బంతుల్లో 10x4), అజింక్య రహానె (58; 78 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకాలతో ఆదుకున్నారు.
కాపాడిన పుజారా, రహానె
That's Lunch on Day 3 of the 2nd #SAvIND Test!
103 runs for #TeamIndia in the first session
4 wickets for South Africa
We will be back for the second session shortly.
Scorecard ▶️ https://t.co/b3aaGXmBg9 pic.twitter.com/BDUIS1oqxJ — BCCI (@BCCI) January 5, 2022
ఓవర్‌నైట్ స్కోరు 85/2తో మూడో రోజు, బుధవారం టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆరంభించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా ఓపెనర్ల వికెట్లు చేజార్చుకోవడంతో చెతేశ్వర్ పుజారా (35 ఓవర్‌నైట్ స్కోర్), అజింక్య రహానె (11 ఓవర్‌నైట్ స్కోరు) ఆచితూచి ఆడారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పరిస్థితుల్లోనూ చక్కని స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశారు. గత మూడు ఇన్నింగ్సుల్లో విఫలమైన నయావాల్ 62 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. ఆ తర్వాత జింక్స్ 67 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకోవడంలో 33.3 ఓవర్లలో టీమ్‌ఇండియా స్కోరు 150కి చేరుకుంది.
Lunch in Johannesburg 🍲
— ICC (@ICC) January 5, 2022
South Africa have wrestled control back with four wickets late in the first session.
Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺#WTC23 | https://t.co/WrcdXdQlUm pic.twitter.com/f6mHNoYrUx
మూడో వికెట్‌కు 144 బంతుల్లో 111 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని జట్టు స్కోరు 155 వద్ద రహానెను ఔట్ చేయడం ద్వారా రబాడా విడదీశాడు. మరికాసేపటకే రహానెనూ అతడే పెవిలియన్ పంపించాడు. రిషభ్ పంత్ (0)నూ వదల్లేదు. రవిచంద్రన్ అశ్విన్ (16) పోరాడేందుకు ప్రయత్నించాడు.
Also Read: Ranji Trophy Postpone: ఆటగాళ్లకు కరోనా ఎఫెక్ట్.. రంజీ ట్రోఫీ వాయిదా వేసిన బీసీసీఐ
MI vs SRH, Match Highlights: రమణను నమ్మని డేవిడ్ - సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆ రనౌట్!
MI vs SRH, 1 Innings Highlights: ఫైనల్ ఆడినట్టుగా చితక్కొట్టిన సన్‌రైజర్స్ - ముంబయికి భారీ టార్గెట్!
MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్ వైపే! టాస్ ఓడిన కేన్ మామ!
Tilak Varma: ట్విటర్లో తిలక్ వర్మ ట్రెండింగ్- సన్నీ గావస్కర్ సెన్సేషనల్ కామెంట్స్
IPL Playoffs Scenarios: ఆర్సీబీకి హార్ట్ అటాక్ తెప్పించిన పంత్ సేన! 'జస్ట్' ఓడిపోతే ప్లేఆఫ్స్‌కు LSG, RR!
Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి
Fat Removal Surgery: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?
Weather Updates : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Horoscope Today 18th May 2022: ఈ రాశివారు పనితీరు మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవ్, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి