X

IND vs ENG: రద్దయిన టెస్టు మళ్లీ జరిగే అవకాశం.. ఎప్పుడంటే?

ఇంగ్లండ్‌‌తో మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టును కరోనా కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ టెస్టు మళ్లీ జరిగే అవకాశం ఉంది.

FOLLOW US: 

ఈ నెల ప్రారంభంలో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌తో జరగాల్సిన టెస్టు మ్యాచ్ ఆటగాళ్లకు కరోనా సోకడంతో రద్దు అయిన సంగతి తెలిసిందే. దీని బదులు భారతదేశంలో ఇంగ్లండ్‌లో మరో టెస్టు మ్యాచ్ ఆడనుందని బీసీసీఐ అధికారి ఒకరు ఏబీపీ న్యూస్‌కు తెలిపారు. ఈ టెస్టు మ్యాచ్ వచ్చే ఏడాది వేసవిలో జరగనుందని తెలుస్తోంది.

అయితే ఈ టెస్టు మ్యాచ్ ఆగిపోయిన సిరీస్‌కు కొనసాగింపా లేదా ఈ ఒక్క టెస్టును ప్రత్యేక సిరీస్‌గా పరిగణిస్తారా అనేది తెలియాల్సి ఉంది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అధికారులతో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

ఈ టెస్టుతో పాటు ఇంగ్లండ్‌తో టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌లు కూడా ఆడే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. స్వదేశంలో సిరీస్ కోల్పోయామన్న అపవాదును తప్పించుకోవడానికి ఇంగ్లండ్ జరగబోయే టెస్టును ఆగిన సిరీస్‌కు కొనసాగింపుగా నిర్వహించమని కోరే అవకాశం ఉంది.

Also Read: వార్ వన్‌సైడ్.. బెంగళూరును ఆరు వికెట్లతో ఓడించిన చెన్నై!

మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు సందర్భంగా ఆటగాళ్లకు, వారి సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో అందరికీ కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే గత వారం టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రి సహా ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. రవి శాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ ఆర్ శ్రీధర్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సిరీస్‌లో ఐదో టెస్టును ఆడకుండా టీమిండియా రద్దు చేసుకుంది.

ఈ సిరీస్‌లో ఇప్పటికే కోహ్లీ సేన 2-1తో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ ఇదే సిరీస్‌ను కొనసాగించినా ఇంగ్లండ్ సిరీస్‌ను సమం చేయడం తప్ప గెలిచే అవకాశం ఉంది. భారత్ గెలిస్తే మాత్రం 3-1తో తిరుగులేని విజయంగా మారనుంది. ఐదో టెస్టును త్వరలోనే మళ్లీ నిర్వహించేందుకు ఈసీబీ(ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు)తో కలిసి పని చేస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా గతంలోనే తెలిపారు. ఈ కష్ట సమయంలో తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించినందుకు ఈ సందర్భంగా ఈసీబీకి జైషా థాంక్స్ చెప్పారు. ఈ మ్యాచ్‌ రద్దవ్వడంపై పలువురు మాజీలు, అభిమానులు నిరాశకు గురయ్యారు.

Also Read: టీమిండియా బాటలో శ్రీలంక జట్టు.. ధోనీకి పోటీగా బరిలోకి మహేళ జయవర్దనే

Also Read: అయ్యో మిథాలీ సేన! ఆఖర్లో మెలోడ్రామా.. ఇలా ఓడిపోతారనుకోలేదు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: India India vs England IND vs ENG England IND vs ENG 5th Test Ind Vs Eng Series

సంబంధిత కథనాలు

T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్‌ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్‌

T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్‌ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్‌

T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?

T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?

AFG vs SCT, Match Highlights: స్కాట్లాండ్‌పై ఆఫ్ఘన్ భారీ విజయం.. ఏకంగా 130 పరుగుల తేడాతో!

AFG vs SCT, Match Highlights: స్కాట్లాండ్‌పై ఆఫ్ఘన్ భారీ విజయం.. ఏకంగా 130 పరుగుల తేడాతో!

Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?

Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?

IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?

IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు