IND vs WI, T20 Series: టీమ్ఇండియాకు షాక్‌! టీ20 సిరీసుకు కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ దూరం

IND vs WI, T20 Series: వెస్టిండీస్‌తో టీ20 సిరీసుకు KL Rahul, ఆల్‌రౌండర్‌ Axar Patel దూరమయ్యారు. వారి స్థానాల్లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad), దీపక్‌ హుడా (Deepak Hooda)ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

FOLLOW US: 

IND vs WI, T20 Series: వెస్టిండీస్‌తో టీ20 సిరీసుకు ముంగిట టీమ్‌ఇండియాకు షాక్‌ తగిలింది! ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (Axar Patel) జట్టుకు దూరమయ్యారు. వీరిద్దరూ సిరీస్‌ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. వారి స్థానాల్లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad), దీపక్‌ హుడా (Deepak Hooda)ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

పిక్క కండరాలు పట్టేశాయి

విండీస్‌తో రెండో వన్డేకు కేఎల్‌ రాహుల్‌ అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచులో సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యం అందించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా ఎడమకాలి పిక్క కండరాలు పట్టేశాయి. దాంతో అతడు మూడో వన్డేలో ఆడలేదు. ఇక అక్షర్‌ పటేల్‌ కొవిడ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వీరిద్దరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిహాబిలిటేషన్‌కు వెళ్లనున్నారు.

మిడిలార్డర్లో ఆల్‌రౌండర్లు

మిడిలార్డర్లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ చేయగలిగే వారి కోసం టీమ్‌ఇండియా వెతుకుతోంది. అందుకే దీపక్‌ హుడాను తీసుకుంది. ఇక రుతురాజ్‌ గైక్వాడ్‌ సైతం జాతీయ జట్టుకు ఆడాలని ఎదురు చూస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టాడు. భవిష్యత్తు దృష్ట్యా అతడికి చోటిచ్చింది.

టీమ్‌ఇండియా టీ20 జట్టు

రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, యుజ్వేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపక్‌ హుడా

Also Read: అనుభవం లేని సమద్‌, ఉమ్రాన్‌కు సన్‌రైజర్స్‌ రూ.4 కోట్లు ఎందుకిస్తోంది! విలియమ్సన్‌ది సరైన ధరేనా?

Also Read: మీకిష్టమైన ఫ్రాంచైజీ పర్సులో ఎంత డబ్బుంది? ఏ ఆటగాళ్లు ఉన్నారంటే?

Published at : 11 Feb 2022 06:47 PM (IST) Tags: KL Rahul ruturaj gaikwad Axar Patel T20I series IND vs WI Deepak Hooda

సంబంధిత కథనాలు

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!

IPL 2022 TV Ratings: ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ ఢమాల్‌! పరిహారం డిమాండ్‌ చేస్తున్న అడ్వర్టైజర్లు

IPL 2022 TV Ratings: ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ ఢమాల్‌! పరిహారం డిమాండ్‌ చేస్తున్న అడ్వర్టైజర్లు

MI vs DC: అర్జున్‌ తెందూల్కర్‌కు టైమొచ్చింది! ట్విటర్లో ట్రెండింగ్‌!

MI vs DC: అర్జున్‌ తెందూల్కర్‌కు టైమొచ్చింది! ట్విటర్లో ట్రెండింగ్‌!

MI vs DC: ముంబయి.. అస్సాంకు పంపించేది దిల్లీనా, ఆర్సీబీనా? MIకి RCB సపోర్ట్‌!

MI vs DC: ముంబయి.. అస్సాంకు పంపించేది దిల్లీనా, ఆర్సీబీనా? MIకి RCB సపోర్ట్‌!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

Revant Reddy :  కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Rahul Vs S Jaishankar : అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం - రాహుల్‌గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ !

Rahul Vs S Jaishankar :  అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం - రాహుల్‌గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ !