IND vs NZ: అక్షర్ స్థానంలో సుందర్ - వర్కవుట్ అవుతుందా?
న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కింది.
Washington Sundar: టీం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.ఈ సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. టీమ్ ఇండియాలో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే, టీ20 సిరీస్‌లకు అక్షర్ వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నాడు.
అక్షర్ పటేల్ లేకపోవడంతో, వాషింగ్టన్ సుందర్ భారత జట్టులో ఆల్ రౌండర్‌గా ఆడనున్నాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో సుందర్ కూడా జట్టులో భాగమయ్యాడు, అయినప్పటికీ అతనికి ఆ సిరీస్‌లో అవకాశం లభించలేదు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు అక్షర్ పటేల్ గైర్హాజరు కావడంతో సుందర్‌కు జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం వస్తుందని భావిస్తున్నారు.
వాషింగ్టన్ సుందర్ చాలా ప్రతిభావంతుడైన ఆల్ రౌండర్. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బ్యాట్‌తో పాటు బంతితోనూ అద్భుత ప్రదర్శన చేసి ఈ విషయాన్ని నిరూపించాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా తరఫున వాషింగ్టన్ సుందర్ బ్యాట్ తో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను న్యూజిలాండ్‌పై భారత జట్టుకు ట్రంప్ కార్డ్‌గా మారవచ్చు.
టీమ్ ఇండియా తుదిజట్టు (అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ షమీ.
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, సాంట్నర్, ఇష్ సోధి, ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్, అట్టా బ్రేస్‌వెల్.
View this post on Instagram
View this post on Instagram