IND vs NZ, 2nd Test: మయాంక్ మాయ..! లంచ్‌కు టీమ్‌ఇండియా 142/2
టీమ్‌ఇండియా భారీ స్కోరు వైపు దూసుకుపోతోంది. మూడోరోజు, ఆదివారం లంచ్ విరామానికి 2 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.
ముంబయి టెస్టులో టీమ్‌ఇండియా భారీ స్కోరు వైపు దూసుకుపోతోంది. మూడోరోజు, ఆదివారం లంచ్ విరామానికి 2 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (17 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (11 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు. ఫలితంగా ఆధిక్యం 405 పరుగులకు చేరింది. కివీస్‌కు 500+ లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉంది.
మయాంక్ అర్ధశతకం
ఓవర్‌నైట్ స్కోరు 69/0తో మూడోరోజు టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆరంభించింది. 38 పరుగులతో క్రీజులోకి వచ్చిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (62; 108 బంతుల్లో 9x4, 1x6) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్ అర్ధశతకం సాధించాడు. అతడికి తోడుగా 29 పరుగులతో బ్యాటింగ్ చేపట్టిన చెతేశ్వర్ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరినీ కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేలే ఔట్ చేయడం గమనార్హం. జట్టు స్కోరు 107 వద్ద మయాంక్, 115 వద్ద పుజారాను అతడు పెవిలియన్ పంపించాడు. కివీస్ బౌలర్లు అలసిపోయినట్టు కనిపిస్తున్నారు.
A solid 💯-run partnership comes up between @mayankcricket & @cheteshwar1 👌👌
— BCCI (@BCCI) December 5, 2021
Live - https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/jGAbSbvG8V
Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్.. కిర్రాక్! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్!
Also Read: PV Sindhu: వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరిన సింధు.. ప్రత్యర్థి ఎవరంటే?
Also Read: Ajaz Patel Record: 10 వికెట్ల ఫీట్.. ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటే.. వారికి మాత్రమే సాధ్యమా?
Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
FIFTY!@mayankcricket's continues his great form into the second innings.
— BCCI (@BCCI) December 5, 2021
Brings up a fine half-century.
Live - https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/jImbl6d9ki