IND vs NZ: రెండో వన్డేలో ఒక మార్పు చేయనున్న భారత్ - ఎవరు వస్తున్నారు? - ఎవర్ని కూర్చోబెడుతున్నారు?
రెండో వన్డేలో భారత్ తుదిజట్టులో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
IND vs NZ, 2nd ODI: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ జనవరి 21వ తేదీన రాయ్‌పూర్‌లో జరుగుతుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌సు సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. అదే సమయంలో న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లోకి తిరిగి రావాలని కోరుకుంటోంది. అయితే ఈ మ్యాచ్‌కి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు దాదాపు ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.
ఉమ్రాన్ మాలిక్ రిటర్న్ ఫిక్స్
రాయ్‌పూర్ వన్డే మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పునరాగమనం ఫిక్స్ అయినట్లు భావిస్తున్నారు. భారత ప్లేయింగ్ XIలో ఉమ్రాన్ మాలిక్ తిరిగి వచ్చిన తర్వాత, శార్దూల్ ఠాకూర్ పక్కన కూర్చోవాల్సి రావచ్చు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ జట్టులో లేరు. శార్దూల్ ఠాకూర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడాడు. తొలి వన్డేలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో కూడా ఎక్కువగా ఆకట్టుకోలేకపోయాడు.
మొదటి వన్డేలో భారత్ అతి కష్టం మీద 12 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్ అద్భుత డబుల్ సెంచరీతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగటంతో టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టు బ్యాటర్ మైఖెల్ బ్రాస్ వెల్ (140) వీరోచిత శతకంతో జట్టును గెలిపించడానికి విఫలయత్నం చేశాడు.
ఈ మ్యాచ్ లో ఆటంతా శుభ్‌మన్ గిల్ దే. మొదట్నుంచి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ప్రారంభించిన శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ చివరి వరకు అదే ఊపును కొనసాగించాడు. శుభ్‌మన్ గిల్ కెరీర్ లో తొలి డబుల్ సెంచరీని అందుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కళాత్మక షాట్లు కొడుతూ స్కోరు వేగం అస్సలు తగ్గకుండా చూశాడు. చూస్తూ ఉండగానే అర్ధశతకం, శతకం పూర్తిచేసుకున్నాడు.
సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచిన గిల్ మైదానం నలువైపులా చూడచక్కని షాట్లు కొట్టాడు. ఈ క్రమంలో 146 బంతుల్లోనే ద్విశతకం సాధించాడు. ఇది గిల్ కు మొదటి డబుల్ సెంచరీ. అతనికి సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్య (28) సహకరించారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.
టీమ్ ఇండియా తుదిజట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ
న్యూజిలాండ్ తుదిజట్టు (అంచనా)
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్