అన్వేషించండి

IND Vs NZ Toss Update: న్యూజిలాండ్‌పై టాస్ గెలిచిన టీమిండియా - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన హార్దిక్!

న్యూజిలాండ్‌లో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

IND Vs NZ Toss Update: మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఇదే. మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు టీ20ల్లో కూడా పరాజయం లేకుండా టోర్నీని ముగించడంపై కన్నేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ సిరీస్‌కు కూడా రెస్ట్ ఇచ్చారు. దీంతో హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఇక మరోవైపు విలియమ్సన్‌, టిమ్‌ సౌథీ లేని బృందంతో న్యూజిలాండ్ కెప్టెన్ మిషెల్ శాంట్నర్‌ తంటాలు పడుతున్నాడు. పసలేని బౌలింగ్‌ దళంతో బలమైన టీమ్‌ఇండియాను ఢీకొట్టడానికి న్యూజిలాండ్ రెడీ అయింది. ప్రస్తుతానికి టీ20లకు హార్దిక్‌ పాండ్యానే పర్మనెంట్‌ కెప్టెన్‌ అనుకోవచ్చు. రోహిత్‌ శర్మ పగ్గాలు వదులుకోలేదు. అలాగే స్ల్పిట్‌ కెప్టెన్సీ గురించి తనకేమీ తెలియదని ద్రవిడ్‌ అంటున్నాడు. సెలక్టర్లను అడిగితే బెస్టని చెబుతున్నాడు.

రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయంతో దూరమయ్యాడు కాబట్టి శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేయడం దాదాపు ఖాయమే. అయితే పవర్‌ప్లేలో పృథ్వీషాను మించి ధాటిగా బ్యాటింగ్‌ చేసేవాళ్లు లేరు. ఒకవేళ ముగ్గురూ ఆడితే కిషన్‌ వన్‌డౌన్లో, సూర్య సెకండ్‌ డౌన్‌లో రావాల్సిందే. ఫ్యాన్స్‌ సూర్యకుమార్ మెరుపుల కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్ త్రిపాఠి, దీపక్‌ హుడా గురించి తెలిసిందే. బ్యాటింగ్‌ విభాగమైతే భీకరంగానే ఉంది.

బౌలర్ల విషయానికి వస్తే... పేస్‌ ఏస్‌ బౌలర్ ఉమ్రాన్‌ మాలిక్‌కు చోటు గ్యారంటీ. కుర్రాడు శివమ్‌ మావికి వరుసగా అవకాశాలు ఇస్తుండొచ్చు. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఎలాగూ ఉన్నాడు. అదనంగా హార్దిక్‌ పాండ్యా పేస్‌ బౌలింగ్‌ వేయగలడు. దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నారు కాబట్టి కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌లో ఒక్కరికే చోటు దక్కుతుంది. వైవిధ్యం కావాలనిపిస్తే వన్డేల్లో ఫామ్‌ చూపించిన కుల్‌దీప్‌కు చోటిస్తారు. ప్రస్తుతానికి కూర్పు పరంగా టీమ్‌ఇండియాకు ఇబ్బందులేం లేవు.

రాంఛీ మైదానం రెండో విడత బ్యాటింగ్ చేసిన జట్లకు అనుకూలిస్తుంది. అందుకే టాస్‌ గెలిచిన జట్లు మొదట బౌలింగ్‌కే ప్రాధాన్యం ఇస్తాయి. ఈ కారణంగానే హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ఇక్కడ 25 టీ20లు జరిగితే 16 ఛేదన జట్లే గెలిచాయి. రెండో ఇన్నింగ్సులో మంచు కీలకంగా మారుతుంది. ఈ వేదికలో టీమ్‌ఇండియా ఇప్పటి వరకు ఆడిన మూడు వన్డేల్లో విజయం అందుకుంది. 2021లో కివీస్‌నూ ఓడించింది. సొంత మైదానం కావడంతో జార్ఖండ్ లేటెస్ట్ డైనమైట్ ఇషాన్‌ కిషన్‌పై కూడా ఈ మ్యాచ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

భారత్ తుదిజట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్‌దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్

న్యూజిలాండ్ తుదిజట్టు
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డేరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget