By: ABP Desam | Updated at : 28 Jan 2023 11:28 PM (IST)
మొదటి టీ20లో భారత్ ఓటమి పాలైంది.
జార్ఖండ్‌లో భారత్‌కు భారీ షాక్. టీమిండియాపై న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితం అయింది. దీంతో సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
177 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. లోకల్ బాయ్ ఇషాన్ కిషన్ (4), శుభ్‌మన్ గిల్ (7), రాహుల్ త్రిపాఠి (0) ముగ్గురూ ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో భారత్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే నాలుగో వికెట్‌కు సూర్యకుమార్ యాదవ్ (47), హార్దిక్ పాండ్యా (21) 68 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించారు.
అయితే వీరిద్దరూ కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే అవుటయ్యారు. అనంతరం వాషింగ్టన్ సుందర్ పోరాడినా తనకు మరో ఎండ్‌లో మద్దతు లభించలేదు. దీంతో భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితం అయింది.
అంతకు ముందు న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం ందించారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ 4.2 ఓవర్లలో 43 పరుగులు జోడించారు. ఫిన్ అలెన్ 23 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక డ్వేన్ కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీని తర్వాత చాలా మంది బ్యాట్స్‌మెన్ ఎక్కువగా రాణించలేక పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే చివర్లో డేరిల్ మిచెల్ 30 బంతుల్లో అజేయమైన 59 పరుగుల ఇన్నింగ్స్‌తో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు అందుకున్నాడు. దీంతో పాటు అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో మైకేల్ బ్రేస్‌వెల్ రనౌట్ అయ్యాడు. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 3-0తో విజయం సాధించింది. ఇప్పుడు టీ20 సిరీస్‌లో ఇరు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. మొదటి టీ20లో న్యూజిలాండ్ విజయం సాధించింది కాబట్టి ఇప్పుడు ఒత్తిడిపై భారత జట్టుపై పడనుంది.
UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్!
UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్ టార్గెట్ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!
UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!
RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్ 'కెర్' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్ టాపర్!
RCB-W vs MI-W, 1 Innings Highlight: ముంబయి టార్గెట్ జస్ట్ 126 - ఆఖరి మ్యాచులో ఆర్సీబీ గెలుస్తుందా?
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా