IND Vs ENG: ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్‌గా మొయిన్ అలీ... బట్లర్ స్థానంలో అలీకి బాధ్యతలు అప్పగింత... రేపటి నుంచే నాలుగో టెస్టు
IND Vs ENG: భారత్‌తో జరగబోయే నాలుగో టెస్టుకి ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు వైస్ కెప్టెన్‌గా మొయిన్ అలీని ప్రకటించింది.
IND Vs ENG: భారత్‌తో జరగబోయే నాలుగో టెస్టుకి ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు వైస్ కెప్టెన్‌గా మొయిన్ అలీని ప్రకటించింది. జాస్ బట్లర్ స్థానంలో అతడు ఈ కొత్త బాధ్యతలు నిర్వహిస్తాడు.
వ్యక్తిగత కారణాలతో జాస్ బట్లర్ భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ బాధ్యతలు ఎవరికి దక్కుతాయా అని ఆసక్తి నెలకొంది. మొదట రోరి బర్న్స్‌కి వైప్ కెప్టెన్ బాధ్యతలు అందుతాయని వార్తలు వచ్చాయి. కానీ, చివరికి అనుభవం కలిగిన ఆటగాడు మొయిన్ అలీకి బాధ్యతలు దక్కాయి. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అధికారికంగా అభిమానులతో పంచుకుంది.
Moeen Ali has been named as our vice-captain for the fourth LV= Insurance Test against India. Congrats, Mo! 👏 pic.twitter.com/4eYRn9WXWv
— England Cricket (@englandcricket) September 1, 2021
మొయిన్ అలీ ఇంగ్లాండ్ తరఫున 63 టెస్టులు ఆడాడు. 2,869 పరుగులతో 193 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2014లో అరంగేట్రం చేసిన అలీ ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాణించాడు. 2017లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ అలీ కెరీర్లో చెప్పుకోదగ్గ సిరీస్. ఈ సిరీస్‌లో అతడు ఏకంగా 20 వికెట్లు తీసి 200 పరుగులు చేశాడు.
34 ఏళ్ల అలీ ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టులో సభ్యుడు. జాస్ బట్లర్ దంపతులు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ నేపథ్యంలో బట్లర్ భారత్‌తో మిగిలిని రెండు టెస్టులకు దూరమయ్యాడు. అంతేకాదు IPLకి దూరమౌతున్నట్లు ప్రకటించాడు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ X ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు గురువారం ప్రారంభంకానుంది. లండన్‌లోని ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రా అవ్వగా, లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇక మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయం మూటకట్టుకుంది. దీంతో ఇరు జట్లు చెరో విజయంతో సమజ్జీవులుగా నిలిచాయి. మరి, నాలుగో టెస్టులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.