(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG: టీమిండియాలో మరొకరికి కరోనా పాజిటివ్... ప్రాక్టీస్ సెషన్ రద్దు
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న టీమిండియా సహాయక సిబ్బందిలో తాజాగా మరొకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న టీమిండియా సహాయక సిబ్బందిలో తాజాగా మరొకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో టీమిండియా ఆటగాళ్లకు ఈ రోజు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేశారు.
Also Read: Ravi Shastri Test Positive: టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్
Just in: A member of India's support staff in Manchester has tested positive for Covid-19
— ESPNcricinfo (@ESPNcricinfo) September 9, 2021
The team has cancelled their training session scheduled for Thursday afternoon. #ENGvIND
మాంచెస్టర్ వేదికగా భారత్ X ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం(సెప్టెంబరు 10) నుంచి చివరి టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్టు కోసం బుధవారమే ఆటగాళ్లు మాంచెస్టర్ చేరుకున్నారు. తొలి ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొన్నారు. అయితే, ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ముందు జాగ్రత్తగా ఈ రోజు జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీమిండియా యాజమాన్యం ప్రకటించింది. ఆటగాళ్లంతా హోటల్ రూమ్‌లకు పరిమితం కావాల్సిందిగా బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం.
Team India's second physio Yogesh Parmar has tested positive for Covid. Players have been confined to hotel rooms. Practice canceled. #ENGvIND @BCCI
— Arani Basu (@AraniBasuTOI) September 9, 2021
టీమిండియా ఫిజియో యోగేశ్ పర్మార్‌కి తాజాగా కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే జట్టు సభ్యులందరికీ మరోసారి కోవిడ్ పరీక్షలు చేయనున్నట్లు మేనేజ్‌మెంట్ తెలిపింది. ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
ESPNcricinfo understands that India's squad members have been asked to stay back in their hotel rooms till further notice. #ENGvIND
— ESPNcricinfo (@ESPNcricinfo) September 9, 2021
Details ⤵ https://t.co/QEDmbzafoe