అన్వేషించండి

IND vs AUS: ఆస్ట్రేలియాపై మూడో అతి పెద్ద విజయం - రికార్డులు బద్దలుకొట్టిన భారత్!

నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇది ఆస్ట్రేలియాపై భారత్‌కు మూడో అతిపెద్ద విజయం.

India vs Australia 1st Test Nagpur: టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. నాగ్‌పూర్‌లో టీమిండియా సాధించిన ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. ఇన్నింగ్స్ పరంగా ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది మూడో అతిపెద్ద విజయం.

ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా ఈ మ్యాచ్ ప్రత్యేకం. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఎన్నో రికార్డులను అశ్విన్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత కంగారూ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకు ఆలౌటైంది.

ఇన్నింగ్స్ పరంగా 1997/98లో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా అతిపెద్ద విజయం సాధించింది. కోల్‌కతా టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 219 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దీని తర్వాత హైదరాబాద్ టెస్టులో టీమిండియా రెండో భారీ విజయాన్ని అందుకుంది. 2012/13లో కంగారూ జట్టును భారత్ ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో ఓడించింది. దీని తర్వాత ఇప్పుడు నాగ్‌పూర్‌లో మూడో విజయం సాధించింది. నాగ్‌పూర్ టెస్టులో రవీంద్ర జడేజాకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. టెస్టు మొత్తంలో ఏడు వికెట్లు తీయడంతో పాటు హాఫ్ సెంచరీ కూడా చేశాడు.

మ్యాచ్ మూడో రోజు 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. ఈ సిరీస్ ముందు వరకు సూపర్ ఫాంలో ఉన్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను స్లిప్ లో కోహ్లీ క్యాచ్ తో ఔట్ చేసిన అశ్విన్.. వికెట్ల పతనానికి తెరలేపాడు. ఆ తర్వాత ఏ దశలోనూ ఆస్ట్రేలియా కోలుకోలేదు. అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీ క్యాచ్ జారవిడవటంతో బతికిపోయిన వార్నర్ అవకాశాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదు. 41 బంతుల్లో 10 పరుగులు చేసిన వార్నర్ అశ్విన్ బౌలింగ్ లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత లబూషేన్ (28 బంతుల్లో 17)ను జడేజా వెనక్కు పంపాడు. ఆ తర్వాతంతా అశ్విన్ విశ్వరూపమే చూపించాడు. వరుసగా వికెట్లు పడగొట్టాడు. యాష్ ధాటికి రెన్ షా (7 బంతుల్లో 2), హ్యాండ్స్ కాంబ్ (6 బంతుల్లో 6), అలెక్స్ క్యారీ (6 బంతుల్లో 10) పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ 3 వికెట్లు ఎల్బీ రూపంలోనే రావడం గమనార్హం. ఆ తర్వాత మిగతా పనిని జడేజా, అక్షర్, షమీలు లు పూర్తి చేశారు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 5, జడేజా 2, షమీ 2, అక్షర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. 

పేసర్లు ఆరంభించారు. బ్యాటర్లు రాణించారు. స్పిన్నర్లు చుట్టేశారు. ఇదీ తొలి టెస్టులో భారత్ ఆట సాగిన తీరు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 177 పరుగులకే ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, షమీలు తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ బ్యాటర్లలో లబూషేన్ (49), స్మిత్ (37), హ్యాండ్స్ కాంబ్ (31), అలెక్స్ క్యారీ (36) పరుగులతో రాణించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియాకు 223 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ శర్మ (120) సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్ (84), అశ్విన్ (70), షమీ (37) పరుగులతో ఆకట్టుకున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather Update: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం ప్రభావం- మూడు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం ప్రభావం- మూడు రోజుల పాటు వర్షాలు 
Vahana Mitra: ఆంధ్రప్రదేశ్‌లో వాహనమిత్ర ఎవరికి ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌లో వాహనమిత్ర ఎవరికి ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Telangana Latest News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్- సాదాబైనామా క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ 
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్- సాదాబైనామా క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ 
Kishkindhapuri Twitter Review - కిష్కింధపురి ట్విట్టర్ రివ్యూ: ప్రీ క్లైమాక్స్‌లో 'జై శ్రీరామ్' ఎపిసోడ్‌కు గూస్ బంప్స్... హారర్ థ్రిల్లర్‌తో బెల్లంకొండ హిట్టు కొట్టాడా? ప్రీమియర్స్ టాక్
కిష్కింధపురి ట్విట్టర్ రివ్యూ: ప్రీ క్లైమాక్స్‌లో 'జై శ్రీరామ్' ఎపిసోడ్‌కు గూస్ బంప్స్... హారర్ థ్రిల్లర్‌తో బెల్లంకొండ హిట్టు కొట్టాడా? ప్రీమియర్స్ టాక్
Advertisement

వీడియోలు

Prince Frederick Louis The Cricket Tragedy | క్రికెట్ కోసం కిరీటాన్ని వదులుకున్న ఇంగ్లీష్ రాజు | ABP Desam
SA20 Auction Highlights | SA20 వేలంలో కోట్లు కురిపించిన ఫ్రాంఛైజీలు
India vs UAE Preview | నేడే ఇండియా vs UAE మ్యాచ్
Azmatullah Omarzai Asia Cup 2025 | ఆసియా కప్ లో అజ్మతుల్లా ఊచకోత
Azmatullah Omarzai in Asia Cup 2025 | ఆసియా కప్ లో అజ్మతుల్లా ఊచకోత
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Weather Update: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం ప్రభావం- మూడు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం ప్రభావం- మూడు రోజుల పాటు వర్షాలు 
Vahana Mitra: ఆంధ్రప్రదేశ్‌లో వాహనమిత్ర ఎవరికి ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌లో వాహనమిత్ర ఎవరికి ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Telangana Latest News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్- సాదాబైనామా క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ 
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్- సాదాబైనామా క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ 
Kishkindhapuri Twitter Review - కిష్కింధపురి ట్విట్టర్ రివ్యూ: ప్రీ క్లైమాక్స్‌లో 'జై శ్రీరామ్' ఎపిసోడ్‌కు గూస్ బంప్స్... హారర్ థ్రిల్లర్‌తో బెల్లంకొండ హిట్టు కొట్టాడా? ప్రీమియర్స్ టాక్
కిష్కింధపురి ట్విట్టర్ రివ్యూ: ప్రీ క్లైమాక్స్‌లో 'జై శ్రీరామ్' ఎపిసోడ్‌కు గూస్ బంప్స్... హారర్ థ్రిల్లర్‌తో బెల్లంకొండ హిట్టు కొట్టాడా? ప్రీమియర్స్ టాక్
Maoist Party: ''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ
''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ
Hyderabad Crime News: కూరగాయల కత్తితో గొంతు కోశారు- కూక్కర్‌తో తల పగలగొట్టి హత్య- స్కూటీలో పరార్‌- హైదరాబాద్‌లో దారుణం
కూరగాయల కత్తితో గొంతు కోశారు- కూక్కర్‌తో తల పగలగొట్టి హత్య- స్కూటీలో పరార్‌- హైదరాబాద్‌లో దారుణం
Asia Cup 2025 IND Vs PAK Latest Update: షాకింగ్.. ఇండియా, పాక్ మ్యాచ్ కు అమ్ముడు పోని టికెట్లు.. మ్యాచ్ కు 4 రోజులే గ‌డువు.. అస‌లు కార‌ణాలివే..?
షాకింగ్.. ఇండియా, పాక్ మ్యాచ్ కు అమ్ముడు పోని టికెట్లు.. మ్యాచ్ కు 4 రోజులే గ‌డువు.. అస‌లు కార‌ణాలివే..?
Ayurveda Secrets : మసాలా దినుసులు ఏయే సమస్యలకి ఉపయోగించవచ్చో తెలుసా? మెరుగైన ఆరోగ్యం కోసం వీటిని ట్రై చేయండి
మసాలా దినుసులు ఏయే సమస్యలకి ఉపయోగించవచ్చో తెలుసా? మెరుగైన ఆరోగ్యం కోసం వీటిని ట్రై చేయండి
Embed widget