By: ABP Desam | Updated at : 12 Feb 2023 09:14 PM (IST)
మొదటి టెస్టులో టీమిండియా ఆటగాళ్లు
Arun Jaitley Stadium Test Records: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు టీమ్ ఇండియా రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. గత 36 ఏళ్లలో ఈ మైదానంలో ఏ టెస్టు మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడిపోలేదు.
మొత్తం ఎన్ని టెస్టులు ఆడారు?
ఈ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 36 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటి మ్యాచ్ 1948లో జరిగింది. ఇక చివరి టెస్ట్ మ్యాచ్ 2017లో జరిగింది. ఈ మ్యాచ్ భారత్-శ్రీలంక మధ్య జరగగా, డ్రాగా ముగిసింది. కాగా 1948లో భారత్, వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది.
టీం ఇండియా ఎన్ని మ్యాచ్‌లు గెలిచింది?
ఈ మైదానంలో టీమిండియా మొత్తం 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పర్యాటక జట్లు ఆరు మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. ఇక మొత్తం 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అంటే ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో దాదాపు 45 శాతం (44.12%) డ్రా అయ్యాయన్న మాట.
టాస్ బాస్ అవుతుందా?
ఇక్కడ టాస్ గెలిచిన జట్లు ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు గెలిచాయి. మరోవైపు టాస్ ఓడినప్పటికీ టీమిండియా 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఆరు మ్యాచ్‌లు గెలవగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టు 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు ఎవరిది?
విరాట్ కోహ్లీ 2017లో శ్రీలంకతో ఆడుతున్నప్పుడు ఈ మైదానంలో 243 పరుగులు చేశాడు. ఈ మైదానంలో ఒక ఆటగాడు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే.
ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ మొత్తం
1959లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 644 పరుగులు చేసింది. అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు.
ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు?
1987లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక ఇన్నింగ్స్‌లో ఏ జట్టు అయినా చేసిన అత్యల్ప స్కోరు ఇదే.
అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు
1999లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే 74 పరుగులకు 10 వికెట్లు పడగొట్టాడు. అయితే ఒక ఇన్నింగ్స్‌లో ఇంతకంటే ఎక్కువ వికెట్లు ఎవరూ తీయలేరు. అదే సమయంలో అతను ఈ మ్యాచ్‌లో మొత్తం 14 వికెట్లు తీశాడు. ఈ మైదానంలో ఏ బౌలర్‌కైనా ఇదే అత్యుత్తమం.
టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. నాగ్‌పూర్‌లో టీమిండియా సాధించిన ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. ఇన్నింగ్స్ పరంగా ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది మూడో అతిపెద్ద విజయం.
ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా ఈ మ్యాచ్ ప్రత్యేకం. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఎన్నో రికార్డులను అశ్విన్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత కంగారూ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకు ఆలౌటైంది.
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?
శాంతిభద్రతల్లోనే కాదు ఆటల్లోనూ తగ్గేదేలే
MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?
DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం