ICC T20 World Cup Anthem: టీ20 ప్రపంచకప్ థీమ్ సాంగ్ చూస్తారా? అద్దిరిపోయింది!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ నేపథ్య గీతాన్ని ఐసీసీ ఆవిష్కరించింది. టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్, అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ వీడియోలో కనిపించారు.
పొట్టి క్రికెట్ ప్రపంచకప్‌నకు మరికొన్ని రోజులే ఉంది. మెగా టోర్నీకి ముందే అభిమానుల్లో క్రేజ్ పెంచేందుకు ఐసీసీ సన్నాహాలు మొదలుపెట్టింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నేపథ్య గీతాన్ని ఆవిష్కరించింది. సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్, అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ వీడియోలో కనిపించారు.
Also Read: IPL 2021: దేవుడిచ్చిన ప్రతిభను వృథా చేస్తున్నాడు: సంజు శాంసన్‌పై సన్నీ ఆగ్రహం
బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ ఈ గీతానికి బాణీలు సమకూర్చడం ప్రత్యేకం. యువ అభిమానులను దృష్టిలో పెట్టుకొని క్రికెటర్ల యానిమేషన్ చిత్రాలతో ఈ వీడియోను రూపొందించారు. 'లైవ్ ద గేమ్' నేపథ్యంతో వచ్చిన ఈ థీమ్‌సాంగ్‌లో అన్ని దేశాలకు ప్రాతినిధ్యం ఇచ్చారు.
మొదట విరాట్ కోహ్లీ యానిమేషన్ వెర్షన్‌లో కనిపించాడు. ఆ తర్వాత పొలార్డ్, మాక్స్‌వెల్, రషీద్ ఖాన్ అతడికి తోడయ్యారు. అదే విధంగా ఆయా జట్ల జెర్సీ రంగులను ప్రదర్శిస్తూ అన్ని దేశాలను గౌరవించారు. మొత్తంగా ఈ వీడియోను 2D, 3D వెర్షన్ల కలబోతగా రూపొందించారు. నేపథ్య గీతాన్ని ఆవిష్కరించిన వెంటనే ఐసీసీ, బీసీసీఐ, స్టార్‌స్పోర్ట్స్ సహా ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్టు చేశారు. డిజైనర్లు, మోడెలర్స్, మ్యాట్ పెయింటర్లు, యానిమేటర్లు, లైటర్లు, కంపోజిటర్లు సహా 40 మంది ఈ థీమ్‌సాంగ్ కోసం పనిచేశారు.
Also Read: IPL 2021: రిషభ్ పంత్.. ఆధునిక క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్! సందేహం లేదన్న మంజ్రేకర్
అక్టోబర్ 17 నుంచి ఒమన్, యూఏఈలో టీ20 ప్రపంచకప్ మొదలవ్వనుంది. నవంబర్ 14న దుబాయ్‌లో ఫైనల్ జరుగుతుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. మొదట అర్హత పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత సూపర్ 12 మొదలవుతుంది. అరంగేట్రం తర్వాత టీమ్‌ఇండియా మరో టీ20 ప్రపంచకప్ గెలవలేదు. విరాట్ కోహ్లీ సైతం తన కెరీర్లో ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. పైగా పొట్టి క్రికెట్ జట్టు నాయకత్వ బాధ్యతలు వదిలేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ప్రపంచకప్ గెలవాలని భారత్ కసిగా ఉంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
🎵 Let the world know,
— ICC (@ICC) September 23, 2021
This is your show 🎵
Come #LiveTheGame and groove to the #T20WorldCup anthem 💃🕺 pic.twitter.com/KKQTkxd3qw