X

IPL 2021: రిషభ్‌ పంత్‌.. ఆధునిక క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్‌! సందేహం లేదన్న మంజ్రేకర్‌

వాస్తవంగా రిషభ్ పంత్‌ సైతం వీరేంద్ర సెహ్వాగ్‌ తరహా క్రికెటరే. సమయం దొరికిందంటే సిక్సర్లు, బౌండరీలు బాదేస్తుంటాడు. ఈ తరంలో అతడో ట్రయల్‌ బ్లేజర్‌ అని మంజ్రేకర్‌ అన్నాడు.

FOLLOW US: 

యువ క్రికెటర్‌ రిషభ్ పంత్‌పై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచులో అతడు అద్భుతంగా ఆడాడని పేర్కొన్నాడు. ఆధునిక క్రికెట్లో అతడు వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి ఆటగాడని వెల్లడించాడు. హైదరాబాద్‌, దిల్లీ మ్యాచ్‌ తర్వాత మంజ్రేకర్‌ మీడియాతో మాట్లాడాడు.

'భారత జట్టులోకి వీరేంద్ర సెహ్వాగ్‌ వచ్చినప్పటికే ద్రవిడ్‌, తెందూల్కర్‌ టన్నుల కొద్దీ పరుగులు చేశారు. కానీ వీరూ మాత్రం వీరిందరికీ భిన్నం. అతడు 100, 200, 300 పరుగులను సిక్సర్లతో పూర్తిచేశాడు. అలాంటి బ్యాటింగ్‌ను టెస్టు క్రికెట్లో మనం అంతకు ముందు చూడలేదు. వాస్తవంగా రిషభ్ పంత్‌ సైతం వీరేంద్ర సెహ్వాగ్‌ తరహా క్రికెటరే. సమయం దొరికిందంటే సిక్సర్లు, బౌండరీలు బాదేస్తుంటాడు. ఈ తరంలో అతడో ట్రయల్‌ బ్లేజర్‌' అని మంజ్రేకర్‌ అన్నాడు.

Also Read: MI vs KKR Match Preview: హిట్‌ మ్యాన్‌ వచ్చేస్తాడా? ముంబయిని చూస్తే కోల్‌కతాకు వణుకే.. ఈసారైన మారేనా!

రిషభ్‌ పంత్‌ ఊరికే షాట్లు ఆడటం లేదని సంజయ్‌ అంటున్నాడు. దూకుడుగా ఆడాలన్నది జట్టు ప్రణాళికగా పేర్కొన్నాడు. సునాయాసంగా సిక్సర్లు బాదేసే అతనుండటం దిల్లీ జట్టుకు గొప్ప ప్రయోజనమని వెల్లడించాడు.

'కొన్నిసార్లు మీరు ఇంగ్లాండ్‌లో రిషభ్‌ పంత్‌ ప్రదర్శన గురించి ఆలోచిస్తుండొచ్చు. ఎందుకంటే అతనక్కడ విఫలమయ్యాడు. కానీ దిల్లీ మ్యాచులో మాత్రం సమయోచితంగా, క్యాల్కులేటెడ్‌ షాట్లు ఆడాడు. అతడిలో ఎలాంటి గందరగోళం, పరుగులు చేయాలన్న ఆందోళన కనిపించలేదు. ఎందుకంటే ఆ జట్టు ముందుగానే అతనెలా ఆడాలో ప్రణాళికలు వేసుకుంది. ఆట ఆఖర్లో సిక్సర్లు, బౌండరీలు బాదే వారితో ఎంత ప్రయోజనం ఉంటుందో మనం చూశాం. అలాంటి వాళ్లు లేకే పంజాబ్‌ కింగ్స్‌ గత మ్యాచులో ఓడిపోయింది. అలాంటి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే రిషభ్ పంత్‌ ఎంతో విలువైన ఆటగాడు' అని మంజ్రేకర్‌ వెల్లడించాడు.

Also Read: DC vs SRH, Match Highlights: హైదరాబాద్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఇక ‘రైజ్’అవ్వడం కష్టమే!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విలియమ్సన్‌ సేన నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో మరో 13 బంతులుండగానే ఛేదించింది. మొదట శిఖర్ ధావన్‌  (42) మంచి ఆరంభం ఇవ్వగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (47*), రిషభ్‌ పంత్‌ (35*) అజేయంగా నిలిచారు. పంత్‌ ఆడింది తక్కువ బంతులే అయినా మూడు బౌండరీలు, రెండు సిక్సర్లు బాదేశాడు.

Also Read: Cricket Update: కివీస్‌కు భారత్‌ నుంచే బెదిరింపులు.. పాక్‌ మంత్రి ఆరోపణలు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: IPL IPL 2021 Rishabh Pant Virender Sehwag Dc vs SRH Kane Williamson Sanjay manjrekar

సంబంధిత కథనాలు

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?

Kohli ODI Captaincy: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!

Kohli ODI Captaincy: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!

IND vs NZ 2nd Test: బిగ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టేందుకు అశ్విన్‌ రెడీ..! ఏంటో తెలుసా?

IND vs NZ 2nd Test: బిగ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టేందుకు అశ్విన్‌ రెడీ..! ఏంటో తెలుసా?

IND vs NZ 2nd Test: కోహ్లీ రాకతో టీమ్‌ఇండియాలో కొత్త సమస్య..! రెండో టెస్టులో...?

IND vs NZ 2nd Test: కోహ్లీ రాకతో టీమ్‌ఇండియాలో కొత్త సమస్య..! రెండో టెస్టులో...?

IPL Retentions 2022: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?

IPL Retentions 2022: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్.. నాదే తప్పైతే వెళ్లిపోతా.. సిరిని గెలిపించి ఓడిన షణ్ముఖ్.. కాజల్, పింకీ ఔట్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్.. నాదే తప్పైతే వెళ్లిపోతా.. సిరిని గెలిపించి ఓడిన షణ్ముఖ్.. కాజల్, పింకీ ఔట్

ATM Transaction Charges: కస్టమర్లకు బ్యాంకుల షాక్‌..! ఐటీఎం లావాదేవీల ఫీజు పెంపు

ATM Transaction Charges: కస్టమర్లకు బ్యాంకుల షాక్‌..! ఐటీఎం లావాదేవీల ఫీజు పెంపు

Horoscope Today: ఈ రాశులవారు కోపం తగ్గించుకోవాల్సిందే .. అందులో మీరున్నారా.. ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today: ఈ రాశులవారు కోపం తగ్గించుకోవాల్సిందే .. అందులో మీరున్నారా.. ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి

Gold-Silver Price: స్థిరంగా పసిడి ధర.. భారీగా తగ్గిన వెండి.. మీ నగరంలోని ధరలివే..

Gold-Silver Price: స్థిరంగా పసిడి ధర.. భారీగా తగ్గిన వెండి.. మీ నగరంలోని ధరలివే..