IPL 2021: ఓ వైపు బాలీవుడ్ మెలొడీ.. మరో వైపు రోహిత్, సూర్య, పొలార్డ్ బ్యాటింగ్‌లో ఢీ.. ఆనందంలో అభిమానులు!
ముంబయి పంచుకున్న వీడియోలో రోహిత్ శర్మ, పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ కసిగా కనిపించారు. బంతిని కిందకు ఆడిన సందర్భాలే కనిపించలేదు. ఎదుర్కొన్న ప్రతి బంతినీ మైదానం బయటకే పంపించారు.
కోల్‌కతాతో పోరుకు సిద్ధంగా ఉన్నామని ముంబయి ఇండియన్స్ సిగ్నల్స్ పంపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్లు ఆడుతున్న వీడియోను పోస్టు చేసింది. ఓ బాలీవుడ్ క్లాసిక్ మెలొడీని జత చేయడంతో ఆ వీడియోను అభిమానులు విపరీతంగా చూస్తున్నారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఐపీఎల్ రెండో దశలో ఆడిన తొలి పోరులో ముంబయి ఇండియన్స్ ఓటమి పాలైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్‌కు విశ్రాంతినివ్వడంతో కీరన్ పొలార్డ్ సారథ్యం వహించాడు. అతడికి మెరుగైన రికార్డే ఉన్నా.. చెన్నై అద్భుతంగా ఆడి గెలిచింది. ఈ నేపథ్యంలో కోల్‌కతాతో జరిగే మ్యాచుకు ముంబయి అన్ని విధాలా సిద్ధమైంది. ఇప్పటికే ఆ జట్టుపై తిరుగులేని రికార్డు ఉంది. పైగా కెప్టెన్ రోహిత్ శర్మ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఆ జట్టు ఆటగాళ్లంతా నెట్స్‌లో కఠోరంగా సాధన చేశారు.
Also Read: IPL 2021: రిషభ్ పంత్.. ఆధునిక క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్! సందేహం లేదన్న మంజ్రేకర్
ముంబయి పంచుకున్న వీడియోలో రోహిత్ శర్మ, పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ కసిగా కనిపించారు. బంతిని కిందకు ఆడిన సందర్భాలే కనిపించలేదు. ఎదుర్కొన్న ప్రతి బంతినీ మైదానం బయటకే పంపించారు. ఇక రోహిత్ శర్మ బంతిని చక్కగా మిడిల్ చేస్తుండటంతో అభిమానులు ఆనందానికి హద్దుల్లేవు. కాగా మరికాస్త విశ్రాంతి అవసరమని భావించడంతోనే రోహిత్, ట్రెంట్ బౌల్ట్‌కు తొలుత విశ్రాంతినిచ్చామని కోచ్ మహేళా జయవర్దనె అన్న సంగతి తెలిసిందే. దాంతో కోల్‌కతా మ్యాచ్‌కు పూర్తి స్థాయి జట్టునే ముంబయి బరిలోకి దించనుందని తెలుస్తోంది.
Also Read: DC vs SRH Live Updates: ఎనిమిది వికెట్లతో ఢిల్లీ విజయం.. సన్‌రైజర్స్ దాదాపు ఇంటికే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
View this post on Instagram
Fasten your seatbelts, it's going to get speedy tonight 🔥#OneFamily #MumbaiIndians #IPL2021 #KhelTakaTak @AdamMilne19 @MXTakaTak MI TV pic.twitter.com/CIbxUNW2MX
— Mumbai Indians (@mipaltan) September 23, 2021
एकच फाईट, वातावरण टाईट! 👊#OneFamily #MumbaiIndians #IPL2021 #MIvKKR pic.twitter.com/VR3vfr3ykr
— Mumbai Indians (@mipaltan) September 23, 2021