(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup 2021 Schedule: క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ...అక్టోబర్ 24న భారత్ vs పాకిస్తాన్...T20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల
ICC T20 World Cup 2021 Schedule: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను మంగళవారం నాడు విడుదల చేసింది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు పొట్టి ప్రపంచకప్ జరగనుంది. దుబాయ్‌ని ఫైనల్ వేదికగా నిర్ణయించారు.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 8 జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా 4 స్థానాల కోసం మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అందులో నాలుగు జట్లకు వరల్డ్ కప్ ఛాన్స్ లభిస్తుంది. తొలి రౌండ్‌లో క్వాలిఫికేషన్ మ్యాచ్‌లు కాగా, రెండో రౌండ్‌లో సూపర్-12 పద్దతిలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Also Read: Rashid Khan on Taliban: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన రషీద్ ఖాన్ కుటుంబం.. యువ క్రికెటర్‌కు కంటిమీద కునుకు లేదు
Mark your calendars 📆
— ICC (@ICC) August 17, 2021
Get ready for the 2021 ICC Men’s #T20WorldCup bonanza 🤩
రౌండ్ 1 గ్రూప్ బీలో ఆతిథ్య ఒమన్ మరియు పపువా - న్యూగినియాల మధ్య మ్యాచ్‌తో అక్టోబర్ 17న ఈ మెగా ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు స్కాట్లాండ్- బంగ్లాదేశ్ జట్ల మధ్య మరో మ్యాచ్ షెడ్యూల్ చేశారు. రౌండ్ 1లో భాగంగా గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నబీబియా జట్లు ఉన్నాయి. గ్రూప్ - బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల అనంతరం ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు టీ20 వరల్డ్ కప్‌నకు అర్హత సాధిస్తాయి. రౌండ్ 2లో భాగంగా అక్టోబర్ 23న సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
Also Read: లార్డ్స్ టెస్టులో భారత్ ఘన విజయం... 151 పరుగుల తేడాతో విజయం... 1-0 ఆధిక్యంలో భారత్
Put on your best blue and get set to cheer, here's how #TeamIndia's schedule for the ICC #T20WorldCup looks like!
— Star Sports (@StarSportsIndia) August 17, 2021
Have you made plans yet?#INDvPAK #INDvNZ #INDvAFG pic.twitter.com/RO1V03FOdD