News
News
X

T20 WC 2021, AUS vs ENG Preview: గ్రూప్‌ 1లో భారత్‌, పాక్‌ పోరు ఇది! చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌తో పోటీకి ఆసీస్‌ సై

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ 1లో నేడు భారత్‌, పాకిస్థాన్‌ లాంటి హై వోల్టేజీ మ్యాచ్‌ జరుగుతోంది. భీకరమైన ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. వీరిలో ఎవరిపై ఎవరిది పైచేయి? కీలక ఆటగాళ్లు ఎవరంటే?

FOLLOW US: 

ఐసీసీ టోర్నీల్లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. అందుకు ఏ మాత్రం తీసిపోవు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ పోరాటాలు! దాదాపుగా దాయదుల తరహాలోనే ఈరెండు జట్ల మధ్య వైరానికి ఎంతో చరిత్ర ఉంది. అందుకే శనివారం దుబాయ్‌ వేదికగా వీరి మధ్య జరిగే సూపర్‌ 12 మ్యాచుపై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిలో ఎవరిపై ఎవరిది పైచేయి అవుతుందో చూడాల్సిందే!

నువ్వా - నేనా!

టీ20ల్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 19 సార్లు తలపడగా 10 సార్లు ఆంగ్లేయులే గెలిచారు. ఒక మ్యాచ్‌ ఫలితం తేల్లేదు. ఈ రెండు జట్లు పోటీ పడితే మైదానంలో జోష్‌ వచ్చేస్తుంది. ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టు తలపడతారు. ఫామ్‌ పరంగా చూస్తే ఇంగ్లాండ్‌కు తిరుగులేదు. పొట్టి క్రికెట్లో చివరి ఐదు మ్యాచుల్లో ఆఖరి నాలుగు వరుసగా గెలిచింది. ఆసీస్‌ సైతం మూడు విజయాలతో ఉంది. ఇక ప్రపంచకప్‌లో చెరో రెండు మ్యాచులు గెలిచి 4 పాయింట్లతో టాప్‌-2లో ఉన్నాయి. ఈ రోజు గెలిచిన వారు 6 పాయింట్లతో టాప్‌లోకి వెళ్లిపోతారు.

ఆ ఇద్దరితో జాగ్రత్త

నాలుగేళ్లుగా ఇంగ్లాండ్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేదు! నిర్భయంగా క్రికెట్‌ ఆడుతూ ప్రపంచాన్ని ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఆ జట్టుకు అన్ని రకాల వనరులూ ఉన్నాయి. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లకు కొదవలేదు. గత రెండు మ్యాచుల్లో పవర్‌ప్లేలో మొయిన్‌ మూడు ఓవర్లు వేశాడు. ఈ సారీ అదే వ్యూహం అమలు చేయొచ్చు. కానీ పవర్‌ప్లేలో ఆఫ్‌స్పిన్‌పై ఆరోన్‌ ఫించ్‌కు 177 స్ట్రైక్‌రేట్‌ ఉంది. క్రిస్‌ జోర్డాన్‌పై స్టాయినిస్‌కు తిరుగులేదు. అతడి బౌలింగ్‌లో 36 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. ఒక్కసారీ ఔట్‌ అవ్వలేదు. ఇవి రెండూ ఇంగ్లాండ్‌ చూసుకోవాలి. భీకరమైన పేస్‌తో భయపట్టే మార్క్‌వుడ్‌ గాయపడటం ఆంగ్లేయులకు బాధాకరమే. ఏదేమైనా ఆ జట్టులో ఏ ఇద్దరు బ్యాటర్లు రాణించినా భారీ స్కోరు ఖాయం.

ఆసీస్‌కు అడ్వాంటేజ్‌

డేవిడ్‌ వార్నర్ ఫామ్‌లోకి రావడంతో ఆస్ట్రేలియాకు ఓపెనింగ్‌ కష్టాలు పోయినట్టే! ఫించ్‌తో అతడు దంచికొడితే పరుగుల వరద పారుతుంది. ఇక మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్, మాథ్యూవేడ్‌తో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. అవసరమైతే కమిన్స్‌, స్టార్క్‌ కూడా పరుగులు చేయగలరు. హేజిల్‌వుడ్‌, స్టార్క్‌, కమిన్స్‌ వంటి పేసర్లకు ఆడమ్‌ జంపా స్పిన్‌ బౌలింగ్‌తో అండగా ఉంటున్నాడు. అవసరమైతే ఆరో బౌలర్‌గా మాక్సీ, స్టాయినిస్‌ ఉపయోగపడతారు. ఆసీస్‌కు ఇంగ్లాండ్‌పై సైకలాజికల్‌ అడ్వాంటేజ్‌ ఉంది. ఛేదనకు దిగితే మాత్రం ఆసీస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువుంటాయి. ఒకవేళ ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిస్తే పరిస్థితి ఉత్కంఠగా మారుతుంది.

Also Read: AFG vs PAK, Match Highlights: పాకిస్తాన్ హ్యాట్రిక్.. ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం

Also Read: T20 WC 2021, WI vs BANG Match Highlites: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ డిఫెండ్‌ చేసింది..! బంగ్లాపై 3 పరుగుల తేడాతో విండీస్‌ విజయం

Also Read: Puneeth Rajkumar Death: నువ్విక లేవని తెలిసి.. త్వరగా వెళ్లావని తలచి..! కన్నీటి సముద్రంలో మునిగిన క్రికెటర్లు!

Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్‌ ఇవే! ఐపీఎల్‌ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Oct 2021 12:31 PM (IST) Tags: Australia England Dubai T20 WC 2021 Eion Morgan Aaron Finch ICC T20 Worldcup 2021 AUS vs ENG Preview AUS vs ENG

సంబంధిత కథనాలు

Punjab Kings Head Coach: అనిల్‌ కుంబ్లేకు షాక్‌! వెతుకులాట మొదలైందట!

Punjab Kings Head Coach: అనిల్‌ కుంబ్లేకు షాక్‌! వెతుకులాట మొదలైందట!

IND vs ZIM ODI Live Streaming: మరోటి గెలిస్తే సిరీస్‌ పట్టేస్తాం! రెండో వన్డే వేదిక, టైమింగ్‌ మారాయా?

IND vs ZIM ODI Live Streaming: మరోటి గెలిస్తే సిరీస్‌ పట్టేస్తాం! రెండో వన్డే వేదిక, టైమింగ్‌ మారాయా?

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

Vinod Kambli: సచిన్ అంతటోడికి ఎందుకీ దుస్థితి!

Vinod Kambli: సచిన్ అంతటోడికి ఎందుకీ దుస్థితి!

BWF World Championships 2022: పీవీ సింధు! నీ మెరుపుల్లేని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఏం బాగుంటుంది!!

BWF World Championships 2022: పీవీ సింధు! నీ మెరుపుల్లేని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఏం బాగుంటుంది!!

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం