WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం - వారికి ఎంట్రీ ఫ్రీ!
మహిళల ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఆన్‌లైన్‌లో ప్రారంభం అయ్యాయి.
Womens Premier League 2023: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మొదటి సీజన్ ప్రారంభానికి ఇప్పుడు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అభిమానులలో ఇప్పటికే ఈ టోర్నమెంట్‌పై భిన్నమైన ఉత్సాహం ఉంది. ఈ సీజన్ మార్చి 4వ తేదీన ప్రారంభమవుతుంది. అయితే ఇది మహిళా ఆటగాళ్లకు పెద్ద వేదికగా పరిగణిస్తున్నారు. దీని కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లకు మహిళలను ఉచితంగా అనుమతిస్తున్నారు
మహిళా క్రికెటర్ల వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. అదే సమయంలో టిక్కెట్ల అమ్మకం గురించిన సమాచారాన్ని కూడా బోర్డు పంచుకుంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్ నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మహిళాల జట్ల మధ్య జరుగుతుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఎక్కడ కొనవచ్చు?
మహిళల ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌కు సంబంధించి అన్ని మ్యాచ్‌ల టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బుక్ మై షో యాప్, వెబ్‌సైట్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు . ఈ సీజన్ కోసం వారిని అధికారిక టికెటింగ్ భాగస్వామిగా చేశారు. అందుకే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనాలనుకునే అభిమానులందరికీ బుక్ మై షోలో టిక్కెట్లు కొనడం గురించి మొత్తం సమాచారం అందుబాటులో ఉంది.
ఆఫ్‌లైన్ టికెట్ ఎలా కొనాలి?
మ్యాచ్‌ల కోసం ఆన్‌లైన్ టిక్కెట్ల అమ్మకం గురించి బోర్డు ఈ సమాచారాన్ని తెలిపింది. కానీ ఆఫ్‌లైన్ టిక్కెట్లు ఎలా తీసుకోవచ్చనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. దీన్ని బట్టి ఆఫ్‌లైన్ టికెటింగ్ దాదాపుగా లేదని అనుకోవచ్చు.
టికెట్ అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
మార్చి 4వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌ల టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా అమ్మడం బీసీసీఐ ఇప్పటికే ప్రారంభించింది.
ఈ మ్యాచ్‌లకు టిక్కెట్ల ధర ఎంత?
మ్యాచ్‌ల కోసం టిక్కెట్ల ధర గురించి చెప్పాటంటే పురుషులు ఈ మ్యాచ్ చూడాలంటే రూ. 100 నుంచి రూ. 400 వరకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో ఈ సీజన్‌కు సంబంధించి బీసీసీఐ పెద్ద నిర్ణయం తీసుకుంది. దీనిలో అన్ని స్టేడియాలలో మహిళా అభిమానుల ప్రవేశం పూర్తిగా ఉచితం. అంటే స్టేడియంలో మ్యాచ్ సమయంలో ఏ వయస్సులోనైనా ఏవైనా మహిళల ప్రవేశం పూర్తిగా ఉచితం.
మహిళ ప్రీమియర్ లీగ్‌లో 20 లీగ్ మ్యాచ్ లు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్, ఒక ఫైనల్ మ్యాచ్ ఉంటాయి. ముంబయిలోని 2 స్టేడియాలలో మాత్రమే మొత్తం మ్యాచ్ లు జరగనున్నాయి. ఆటగాళ్లు ప్రయాణించడానికి వీలుగా డీవై పాటిల్, బ్రబౌర్న్ మైదానాలను మాత్రమే ఎంపికచేశారు. డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 7.30 వరకు జరుగుతాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిసింది. స్మృతి మంథాన, యాష్లే గార్డ్‌నర్, నటాలీ స్కీవర్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ప్లేయర్ల కోసం జట్లు చాలా డబ్బు ఖర్చు చేశాయి. స్మృతి మంధాన అత్యధికంగా 3.4 కోట్లు దక్కించుకుంది.