Hockey World Cup 2023: డ్రాగా ముగిసిన ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ - పాయింట్ల పరిస్థితి ఏంటంటే?
హాకీ ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
FIH Hockey World Cup 2023, Points Table: హాకీ ప్రపంచ కప్ 2023లో ఇంగ్లండ్, టీమ్ ఇండియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిజానికి 12 పెనాల్టీ కార్నర్‌లలో కూడా ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతకుముందు స్పెయిన్‌ను 2-0తో ఓడించిన టీమిండియా ఈ మ్యాచ్‌లో డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు పాయింట్లతో ఉన్నాయి.
భారత్, ఇంగ్లండ్‌లకు చెరో 4 పాయింట్లు
భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ను 2-0తో ఓడించింది. ఇంగ్లండ్ తన తొలి మ్యాచ్‌లో వేల్స్‌ను ఓడించింది. భారత్, ఇంగ్లండ్ రెండూ నాలుగేసి పాయింట్లతో ఉండగా, భారీ గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టు అగ్రస్థానంలో ఉంది.
భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌ని వేల్స్‌తో ఆడనుంది. ఇంగ్లండ్ తన చివరి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుంది. భారత్ ఇంగ్లండ్ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఇంగ్లండ్‌కు ఆరంభం నుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ఇంగ్లిష్ జట్టు మాత్రం అవకాశాలను గోల్‌గా మార్చుకోలేకపోయింది.
భారత్ కూడా తక్కువేమీ కాదు
ఈ మ్యాచ్ ఆరంభంలో ఇంగ్లండ్ జట్టు దూకుడు ప్రదర్శించింది. ఇంగ్లండ్ జట్టుకు అవకాశాలు కూడా లభించాయి, అయితే ఇంగ్లిష్ జట్టు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. అదే సమయంలో, ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెరో 12 పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ ఎవ్వరూ గోల్ చేయలేకపోయారు. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్ 2022లో కూడా భారత్, ఇంగ్లండ్ హాకీ జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది.
View this post on Instagram
View this post on Instagram