Mahendra Singh Dhoni: ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై ధోని ఎఫెక్ట్ - సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?
ఇషాన్ కిషన్‌పై మహేంద్ర సింగ్ ధోని ప్రభావాన్ని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు.
Sourav Ganguly On MSD: సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలు టీమ్ ఇండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ముందంజలో ఉంటారు. మహేంద్ర సింగ్ ధోని 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ ఉన్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2007లో టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియా గెలుచుకుంది. మహేంద్ర సింగ్ జార్ఖండ్‌లోని రాంచీకి చెందినవాడు. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత రాంచీకి చెందిన ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని విశ్వాసాన్ని నింపాడు
అయితే మహేంద్ర సింగ్ దోని గురించి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ గురించి మాట్లాడుతూ... భారత్ తరఫున ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు అన్నది ముఖ్యం కాదని, అతను ఎలా తన మార్క్‌ని వేశాడన్నదే ముఖ్యమని అన్నాడు.
భారత క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోని అందించిన సేవలు చాలా అద్భుతమని, అంతర్జాతీయ క్రికెట్ ఆడగలరనే విశ్వాసాన్ని భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల పిల్లలలో కలిగించడం చాలా ముఖ్యం అని, దాన్ని మహేంద్ర సింగ్ ధోని సాధించాడని సౌరవ్ గంగూలీ చెప్పాడు.
ఉదాహరణ ఇషాన్ కిషనే
దీనికి ఇషాన్ కిషన్‌నే సౌరవ్ గంగూలీ ఉదాహరణగా చూపించాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌లో మహేంద్రసింగ్ ధోనీ టచ్ కనిపిస్తోందని అన్నాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలా దూకుడుగా బ్యాటింగ్ చేయడానికి ఇషాన్ కిషన్ ఇష్టపడతాడని అన్నారు.
సౌరవ్ గంగూలీ తెలుపుతున్న దాని ప్రకారం మహేంద్ర సింగ్ ధోని భారతదేశంలోని చిన్న పట్టణాల ఆటగాళ్లపై భిన్నమైన ముద్ర వేశాడు. దీని తర్వాత చిన్న పట్టణాల ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం వచ్చింది. దీనితో పాటు, ఈరోజు ఇషాన్ కిషన్ క్రికెట్ ఆడుతున్న విధానంలో మహేంద్ర సింగ్ ధోనీ సహకారం ఉందని చెప్పాడు.
అయితే ఇటీవల ఇషాన్ కిషన్ అంత ఫాంలో కనిపించట్లేదు. అతను 2022 డిసెంబర్ 10వ తేదీన డబుల్ సెంచరీ చేయడం ద్వారా చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆ డబుల్ సెంచరీ తర్వాత ఇషాన్ పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇషాన్ బ్యాట్ నుంచి మెరుపులు రాలేదు. అతను ఈ సిరీస్‌లో కేవలం ఎనిమిది సగటుతో, 60 స్ట్రైక్ రేట్‌తో మొత్తంగా 24 పరుగులు మాత్రమే చేశాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ డబుల్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ మొత్తం మూడు వన్డేలు, ఆరు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇన్ని మ్యాచ్‌ల్లోనూ ఇషాన్ బ్యాట్ నుంచి కనీసం హాఫ్ సెంచరీ రాలేదు. ఈ మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు కేవలం 37 పరుగులు మాత్రమే. ఈ పరుగులు కూడా శ్రీలంకతో ఆడిన మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో వచ్చినవి. ఇలాంటి పరిస్థితుల్లో డబుల్ సెంచరీ అతనికి పెద్దగా లాభదాయకంగా లేదని గణాంకాలు చూస్తుంటే చెప్పొచ్చు.